అమలాపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. హీరోయిన్ అమలాపాల్ మొన్నటి దాకా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందరికీ దగ్గరగా ఉన్నారు. రెండవ పెళ్లి తర్వాత ఫోటోషూట్, ప్రెగ్నెన్సీ ఇలా వరుసగా ఏదో ఒక విషయంతో వార్తలు లోకి నిలుస్తూ ఉన్నారు. సినిమాలు తో పాటు ఈమె సోషల్ మీడియాలో కూడా మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. గత సంవత్సరం రెండవ పెళ్లి చేసుకున్న విషయం మనకి తెలుసు. ప్రియుడు జగత్ దేశాయితో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.
Advertisement
నవంబర్ ఐదున పెళ్లి జరిగింది. ఏడాది పూర్తయిన సందర్భంగా మధుర జ్ఞాపకాలని పంచుకున్నారు. కేరళలోని కొచ్చి లో వీళ్ళ పెళ్లి జరిగింది. అంతా బానే ఉంది కానీ అమలాపాల్ పరోక్షంగా తన మొదటి భర్త గురించి కామెంట్లు చేసింది. నా జీవితంలో గతంలో తప్పులు జరగాయని వాటికి థాంక్స్ చెప్తున్నానని చెప్పింది. వాటి వల్ల ఇతను నా జీవితంలోకి వచ్చాడని అమలాపాల్ చెప్పారు.
Advertisement
Also read:
ఈమె జీవితంలో తప్పు అంటే దర్శకుడు పెళ్లి అని అందరూ అనుకుంటున్నారు. జగత్ దగ్గర ఉంటే చాలా సేఫ్ గా అనిపిస్తుంది అని కూడా ఆమె చెప్పుకొచ్చారు. భర్త గురించి పరోక్షంగా కామెంట్లు చేయడంతో కొంతమంది ఆమెపై ఫైర్ అవుతున్నారు తమిళంలో నటిగా కెరియర్ ని స్టార్ట్ చేసిన ఆమె తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి పలు తెలుగు సినిమాల్లో నటించింది. 2014లో తమిళ దర్శక నిర్మాత అయిన విజయ్ ని పెళ్లి చేసుకుంది. 2017 లో వీళ్ళు విడాకులు తీసుకున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!