Home » సాయి పల్లవి కూతురితో సమానం.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్..!

సాయి పల్లవి కూతురితో సమానం.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్..!

by Sravanthi
Ad

ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా మంచి సక్సెస్ ని అందుకుంటున్నారు సాయి పల్లవి. త్వరలో నాగచైతన్యతో తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకి రావడానికి సిద్ధమయ్యారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా వస్తుంది. తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్లు అరవింద్ నిర్మాణంలో చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాలో సాయి పల్లవి, నాగచైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒక జాలరి నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాని తీసుకువస్తున్నారు.

Advertisement

దాదాపు 100% సినిమా షూటింగ్ అయిపోయింది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తోంది. ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ సాయి పల్లవి గురించి మాట్లాడారు. సాయి పల్లవి నటనపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. సాయి పల్లవి నటించిన అమరన్ మూవీ చూసానని అదరగొట్టేసిందని చెప్పారు.

Advertisement

alluaravind-and-nagachaitanya

Also read:

చివర్లో అందరిని ఏడిపించేసింది అని అన్నారు. క్లైమాక్స్ చూసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయని అన్నారు. అదే ఎమోషనల్ తో కారులో కూర్చుని సాయి పల్లవికి ఫోన్ చేసి మాట్లాడాను అని.. నాకు కూతుర్లు లేరు కనుక కూతురు ఉండి ఉంటే సాయి పల్లవిలా ఉండాలని కోరుకుంటానని అల్లు అరవింద్ చెప్పారు. అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading