Home » ఆ డబ్బుతో నా లైఫ్ ఏ మారిపోయింది.. రకుల్ వైరల్ కామెంట్స్..!

ఆ డబ్బుతో నా లైఫ్ ఏ మారిపోయింది.. రకుల్ వైరల్ కామెంట్స్..!

by Sravanthi
Ad

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా పరిచయం అయింది. తన మొదటి సినిమాతో ఇండస్ట్రీలో సక్సెస్ ని అందుకుంది. తర్వాత ఇండస్ట్రీలో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు పక్కన నటించి మెప్పించింది. తెలుగు మూవీస్ తో పాటుగా తమిళ సినిమాల్లో కూడా నటించి అలరించింది. బాలీవుడ్ సినిమాల్లో కూడా అవకాశాన్ని పొందింది. బాలీవుడ్ మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నప్పుడు నిర్మాత నటుడు అయినటువంటి జాకీభగ్నానిని పెళ్లి చేసుకున్నారు.

Advertisement

సౌత్ సినిమాల్లో నటించకపోయినా బాలీవుడ్ మూవీస్ నటిస్తూ కెరియర్ లో బిజీగా ఉన్నారు. దీపావళి పండుగకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరూ దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. టపాసులు కాలుస్తారు. నేను ఐదవ తరగతి చదువుతున్నప్పుడు నాన్న దీపావళికి 500 రూపాయలు ఇచ్చారు.

Advertisement

Also read:

ఆ డబ్బు ఎందుకు అని అడిగితే నువ్వు టపాకాయలు కొని కాలుస్తావు. దాని వలన కాలుష్యం వస్తుంది ఈ డబ్బుతో ఎవరైనా పేద వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి ఏమైనా కొని ఇవ్వు అని చెప్పారని రకుల్ చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటివరకు టపాసులు కాల్చలేదని రకుల్ చెప్పారు. ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading