Home » బాలయ్య షోలో కంటతడి పెట్టుకున్న సూర్య.. ఏమైందంటే..?

బాలయ్య షోలో కంటతడి పెట్టుకున్న సూర్య.. ఏమైందంటే..?

by Sravanthi
Ad

బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. ఆహా లో ప్రసారమవుతున్న ఈ షో కి ఇప్పటికే చాలామంది గెస్ట్లుగా వచ్చారు. అలాగే మూడు సీజన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకుని నాలుగవ సీజన్లోకి వెళ్ళింది. నాలుగవ సీజన్లో భాగంగా రెండు ఎపిసోడ్లని ప్రసారం చేశారు. మూడవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడో ఎపిసోడ్లో భాగంగా కాలీవుడ్ హీరో సూర్య వచ్చారు. సూర్య హీరోగా నటిస్తున్న కంగువా మూవీ నవంబర్ 14న రిలీజ్ అవ్వబోతుంది. బాలయ్య షో కి వచ్చిన సూర్య ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ఈ వీడియోలో భాగంగా బాలయ్య సూర్యని వేదిక మీదకి ఆహ్వానిస్తాడు. నేను సింహం అయితే అతను సింగం. నేను లెజెండ్ అయితే గజిని. నేను అఖండ అయితే అతను రోలెక్స్ అని అదిరిపోయేలా పరిచయం చేస్తారు. బాలయ్య సూర్యను తికముక పెడుతూ ప్రశ్నలు వేస్తాడు ఆయన నుంచి సమాధానాలు వచ్చేలా చేస్తారు. ఇతను తమ్ముడు కార్తీ పేరుని ఫోన్లో ఏమని సేవ్ చేసుకున్నారని అడిగితే తమ్ముడికి ఫోన్ చేసి మరి సూర్య గురించి విషయాలని అడిగి తెలుసుకోవడం జరిగింది.

Advertisement

Also read:

కార్తీ కి ఫోన్ చేసి అన్నయ్య చాలా అబద్దాలు ఆడారని చెప్తే కార్తీ కూడా చిన్నప్పటి నుంచి అంతే సార్ అని కౌంటర్ వేశాడు. ఒక నటి అంటే ఆయనకి చాలా ఇష్టమని అంటాడు. నువ్వు కార్తీ కాదురా కత్తి అని తమ్ముడు గురించి సరదాగా మాట్లాడారు. సూర్య వలన చదువుకుని మంచి పొజిషన్లోకి వచ్చిన ఒక అమ్మాయి సూర్య గురించి చెప్తుంది. ఆ వీడియో ప్లే చేయగానే సూర్య ఎమోషనల్ అయిపోయారు. తెలుగు వాళ్ళు కూడా తనకి సహాయం చేసారని సూర్య ఈ కార్యక్రమంలో చెప్పారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading