Home » కార్తీక సోమవారం నాడు ఇలా చేస్తే.. అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం..!

కార్తీక సోమవారం నాడు ఇలా చేస్తే.. అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం..!

by Sravanthi
Ad

కార్తీక సోమవారం నాడు కొన్ని పద్ధతుల్ని పాటించడం వలన మంచి జరుగుతుంది. పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనది. శివుడికి, విష్ణువుకి ఈనెల అంటే ఎంతో ఇష్టం. ఈ మాసంలో కార్తీక సోమవారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కార్తీక సోమవారం ఎవరైతే భక్తుశ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తారో వారి కోరికలు తీరుతాయి. పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కార్తీకమాసంలో ఎవరైతే శివుడుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి చెడు పనుల నుంచి విముక్తి కలుగుతుంది.

Advertisement

కార్తీక మాసంలో మొదటి సోమవారానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అలాగే మిగిలిన సోమవారాలు కూడా ఈ విధంగా ఆచరిస్తే మంచి జరుగుతుంది. పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే నిద్ర లేచి నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయాలి. తర్వాత శివునికి అభిషేకాలు, అర్చనలు చేయాలి.

Advertisement

Also read:

కార్తీక సోమవారం నాడు చేసే స్నానం, పూజ, జపం, ఉపవాసం అన్నీ కూడా అశ్వమేధ యాగం చేసినంత పుణ్యాన్ని ఇస్తాయి ఎంతో మంచిని అందిస్తాయి. కార్తిక సోమవారం ఉపవాసం చేసి అత్యంత భక్తిశ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తే మంచిదట. కోటి సోమవారాలు ఉపవాసం చేసి శివుడిని పూజ అనంత పుణ్యఫలితం కార్తీక సోమవారం నాడు చేస్తే కలుగుతుంది. అలాగే శివుడికి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి ఉపవాసాన్ని నిష్టగా చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading