తిరుమలలో స్వామివారి దర్శనం తర్వాత భక్తులు సురక్షితంగా ఇంటికి చేరుకునేలా ఏర్పాటులు చేస్తోంది. తిరుమలలో అనారోగ్యానికి గురైనా అస్వస్థకు గురైనా ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. తిరుమలకు కాలినడకని వచ్చే భక్తులు అస్వస్థకు గురవుతున్న సంగతి తెలిసిందే. అలాంటి వాళ్లకు కీలక సూచనలు చేసింది టీటీడీ. చిన్నపాటి సమస్యలు ఉన్నా సరే కాలినడక మార్గంలో రావద్దని సూచించింది.
Advertisement
ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎక్కడెక్కడ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయనే దాని గురించి ప్రకటన చేసింది. చాలామంది వృద్ధులు స్వామివారి దర్శనం కోసం వస్తారు. 60 ఏళ్లు దాటిన వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులను కాళ్లు నడకన రావద్దని టీటీడీ సూచించింది.
Advertisement
Also read:
ఊబకాయంతో బాధపడేవారు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు కూడా వాహనాల్లో కొండపైకి రావాలని సూచించింది తిరుమల కొండ సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటుంది. దానికి కారణం ఆక్సిజన్ స్థాయి తక్కువ ఉండడం. సహజంగా కాలినడకన వచ్చేవాళ్ళు వేలాది మెట్లు ఎక్కాలి. అలాంటి సమయంలో ఒత్తిడికి గురవుతున్నారు. భక్తుల కోసం తిరుమలలో అశ్విని హాస్పిటల్, ఇతర హాస్పిటల్స్ 24 గంటల వైద్య సదుపాయాలని ఇస్తున్నాయి. డయాలసిస్ సౌకర్యం కూడా తీసుకువచ్చారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!