కార్తీకమాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఇలా చేయడం మంచిదని పండితులు అంటున్నారు. చాలామంది కార్తీకమాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తారు. అయితే కార్తీకమాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి తులసికోట దగ్గర దీపం పెడితే మంచిది. ఇలా తులసి కోట దగ్గర దీపం పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. డబ్బుకి లోటు ఉండదు. భారతీయ హిందువులు కార్తీక మాసాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు.
Advertisement
కార్తీక మాసానికి సమానమైన మాసం ఏదీ కూడా లేదు. కార్తీకమాసంలో స్నానాలు, దీపాలు, విష్ణు సంకీర్తనతో పాటుగా రుద్రాభిషేకలు వంటివి చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో పరమేశ్వరుడిని ఆరాధించడం వలన మంచి జరుగుతుంది కార్తీకమాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలన్నా లక్ష్మీ కటాక్షం కలగాలన్నా తులసి కోట దగ్గర దీపం పెట్టడం ముఖ్యం.
Advertisement
Also read:
కార్తీకమాసంలో తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోష పడుతుందట. తులసి మొక్కని లక్ష్మీస్థానంగా భావిస్తారు. అలాగే తులసి పూజ తులసి దగ్గర పెట్టే దీపానికి మంచి ఫలితాలు వస్తాయి తులసి దగ్గర దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు. కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు కూడా తొలగిపోతాయట. అలాగే సానుకూల శక్తి పెరిగే ప్రతికూల శక్తి తొలగిపోతుందట ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!