Home » కార్తీకమాసంలో ఈ పొరపాట్లను అస్సలు చేయకూడదు..!

కార్తీకమాసంలో ఈ పొరపాట్లను అస్సలు చేయకూడదు..!

by Sravanthi
Ad

కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. కార్తీకమాసంలో పరమేశ్వరుడిని ఆరాధించడం వలన మంచి జరుగుతుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కార్తీక మాసం గురించి స్కంద పురాణాల్లో కూడా చెప్పబడింది. కార్తీకమాసానికి ఏ మాసం కూడా సాటి రాదు. విష్ణుమూర్తికి సమానమైన దేవుడు కూడా లేడు. గంగతో సమానమైన తీర్థం ఎక్కడ లేదు. శివ కేశవులు ఇద్దరికీ కూడా ఈ నెల అంటే ఎంతో ఇష్టం. కార్తీక మాసం నవంబర్ 2 నుంచి ప్రారంభం అయింది. శివ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడిని ఆరాధిస్తారు. నిత్యం దీపారాధన చేస్తారు. దీప దూప నైవేద్యాలతో ఆధ్యాత్మిక శోభతో ఇల్లు కళకళలాడుతూ ఉంటాయి.

Advertisement

తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటి స్నానం చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది అలాగే తెల్లవారుజామున శివుడికి దీపారాధన చేయడం వలన మంచి ఫలితం కనబడుతుంది. ప్రతిరోజు సాయంత్రం శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి అలాగే కార్తీక మాసంలో మాంసాహారాన్ని తీసుకోకూడదు. ఉల్లి, వెల్లుల్లి కూడా తీసుకోకూడదు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

Advertisement

Also read:

తామసిక ఆహారాన్ని దూరం పెట్టాలి. అలాగే ప్రదోషకాలంలో నిద్రపోకూడదు. సాయంత్రం ఇంట్లో ఎవరైనా నిద్రపోతే మంచిది కాదట. అలాగే కార్తీకమాసంలో వచ్చే ఆదివారాలు కొబ్బరికాయ, ఉసిరిని తీసుకోకూడదు. కార్తీకమాసంలో ఉసిరి దీపం వెలిగించడం చాలా మంచిది, తెలిసి తెలియక చేసే పాపాలు తొలగిపోవడానికి దీప దానం చేయడం మంచిది. దీపదానం చేయడం వలన నరకలోక ప్రాప్తి నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే దీపం వెలిగించడం వలన కూడా పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading