Home » కొడుకును పాడె సీన్ లో చూడ‌లేన‌న్నాడు…వారానికి నిజంగానే పాడెపై చూడాల్సి వ‌చ్చింది…!

కొడుకును పాడె సీన్ లో చూడ‌లేన‌న్నాడు…వారానికి నిజంగానే పాడెపై చూడాల్సి వ‌చ్చింది…!

by AJAY
Ad

తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటులలో కోట శ్రీనివాసరావు కూడా ఒకరు. కామెడీ పాత్రలు, విలన్ పాత్రలు, ఎమోషనల్ సన్నివేశాలు ఇలా ఏ పాత్ర అయినా కోట శ్రీనివాసరావు జీవిస్తారని ప్రూవ్ చేసుకున్నారు. వందల సినిమాల్లో నటించి ఇండ‌స్ట్రీలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం వయసు రిత్యా కోట శ్రీనివాసరావు సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే కోట శ్రీనివాసరావు సినిమాల విషయంలో సక్సెస్ అయినప్పటికీ జీవితంలో జరిగిన ఘటనల‌ వల్ల బాధ‌ప‌డుతూ ఉంటారు.

kota srinivasa rao son

kota srinivasa rao son

కోట శ్రీనివాస రావు తనయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వూలో కోట శ్రీనివాసరావు తన కొడుకు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ రావు మరణం గురించి చెబుతూ బాధ పడ్డారు. కోట శ్రీనివాసరావు కుమారుడు కూడా సినిమాలో నటించాడు. కోట శ్రీనివాసరావు తో జగపతి బాబు కు వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం ఉండేది. ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత్యంతో జగపతిబాబు మీ కుమారుడిని కూడా నటుడిగా పరిచయం చేయవచ్చు కదా అని స‌ల‌హా ఇవ్వగా…. కోట శ్రీనివాసరావు నా కొడుకు పెద్ద హీరో కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు నాలాగా విల‌న్ అయితే చాలు జీవితకాలం సినిమా అవకాశాలు వస్తాయి అని జగపతి బాబుతో అన్నారు.

Advertisement

Advertisement

అదే సమయంలో జగపతిబాబు హీరోగా గాయం -2 సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో విలన్ గా కోటశ్రీనివాసరావు కుమారుడు నటించాడు. ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో భాగంగా జగపతి బాబు విలన్ గా నటించిన కోట ఆంజనేయ ప్రసాద్ రావు ని చంపి తీసుకు వచ్చి అతని ఇంటి ఎదుట పడేసే సన్నివేశం ఉంది. అయితే షూటింగ్ జరుగుతుండగా కోట శ్రీనివాస్ అక్కడే ఉన్నారట. షూటింగ్ కోసం పాడె తయారు చేస్తుండగా చూసిన కోట మనసులో ఏదో అలజడి కలిగిందట.

ఎంతైనా కన్నకొడుకును పాడె పై చూసే సన్నివేశాన్ని ఆయన మనసు ఒప్పుకోలేదట. వెంటనే జ‌గ‌ప‌తి బాబు దగ్గరికి వెళ్లి ఒక విషయం చెప్పాలి అంటూ… నా కొడుకుని అలా చూడడానికి నాకు ఇబ్బందిగా ఉందని చెప్పార‌ట‌. దాంతో జ‌గ‌ప‌తి బాబు మీ సమస్య నాకు అర్థమైంది అక్కడ డూప్ ను పెట్టి మ్యానేజ్ చేస్తాం అని చెప్పారు. అయితే ఈ ఘటన జరిగిన వారం రోజులకే కోట శ్రీనివాసరావు కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించి పాడె ఎక్కాల్సిన‌ పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని కోట చెబుతూ ఎంతో ఆవేదన చెందారు.

also read : CHIRANJEEVI : క్వారంటైన్ లో కవిగా మారిపోయిన మెగాస్టార్…ఆ ఫోటో షేర్ చేసి..!

Visitors Are Also Reading