ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,34,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 893 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 18,84,937 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఈ రోజు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
Advertisement
ఈ రోజు లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
అండర్-19 ప్రపంచకప్ లో భారత్ బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ 111 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ 117/5 పరుగులతో గెలుపొందింది. ఫిబ్రవరి 2న రెండో సెమీస్ జరగనుంది. ఈ సెమీస్ లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది.
Advertisement
తెలంగాణలో రేపటి నుండి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. మిగితా రాష్ట్రాల్లో సైతం కరోనా ఆంక్షలను పాటిస్తు స్కూల్లను తెరిచిన నేపథ్యంలో తెలంగాణలోనూ పాఠశాలలు తెరవలాని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి 18న మేడారం జాతరకు సీఎం కేసీఆర్ వెల్లనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు.
కరీంనగర్ లో దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఉన్న గుడిసెల్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు మరణించారు. గుడిసెలో నిద్రిస్తున్న నలుగురిపైకి కారు వెళ్లడంతో అక్కడికక్కడే మరణించారు.
తెలంగాణలో మరో 3రోజుల పాటూ చలి తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్ లో చలితీవ్రత అత్యల్పంగా 4.9 డిగ్రీలు నమోదయ్యింది.
బాలీవుడ్ హీరోయిన్ అజయ్ దేవ్ గన్ భార్య కాజోల్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని కాజోల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.