Home » రామ మందిరానికి వెళ్ళినప్పుడు ఒక్క ముస్లిండ్రైవర్ చెప్పిన విషయాలివి: చిరంజీవి

రామ మందిరానికి వెళ్ళినప్పుడు ఒక్క ముస్లిండ్రైవర్ చెప్పిన విషయాలివి: చిరంజీవి

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి 150 కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఎంతోమంది కి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికి కూడా చాలామంది ఈయనను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు అయోధ్య రామ మందిరం గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ అయోధ్య రామ మందిరానికి వెళ్లడం సాక్షాత్తు రామచంద్రుడు ఆహ్వానించినట్లు అనిపించిందని అన్నారు అలాగే నరేంద్ర మోడీ తలుచుకోబట్టి అటువంటి గొప్ప నిర్మాణం జరిగిందని చిరంజీవి అన్నారు. ఇది మేము చేసుకున్న అదృష్టం అని అన్నారు.

Advertisement

అయోధ్య రామ మందిరం నుండి సమీపంలో ఉన్న హోటల్ కి వెళ్ళడానికి ఒక కారుని తీసుకున్నాము అని, ఆ కారు డ్రైవర్ ముస్లిం వ్యక్తి అని చిరంజీవి చెప్పారు. అయితే మీరు కాస్త ఇబ్బందిగా ఉన్నారేమోనని చిరంజీవి ఆయన్ను అడిగితే లేదండి మేము బానే ఉన్నాము మా టెన్షన్ కాస్త ఇప్పుడు పోయింది. రోజు కూడా ఎప్పుడు ఏ గొడవలు జరుగుతాయో అని భయపడే వాళ్ళం. స్కూలుకు వెళ్లే మా పిల్లలు కూడా ఏ ఇబ్బందును ఎదుర్కోవాల్సి ఉంటుంది అని బాధ పడే వాళ్ళము.

Advertisement

Also read:

కానీ ఇప్పుడు అంతా కూడా పూర్తయిపోయింది ఏ గొడవలు భవిష్యత్తులో ఇక ఉండవు అటువంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. కనుక మొత్తం అంతా కూడా సర్దుబాటు అయిపోయిందని అన్నారు. ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ మాలో కలిగింది మా బిడ్డలకు కూడా రక్షణ ఉంటుందని ఆ డ్రైవర్ చెప్పినట్లు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగాస్టార్ ఇప్పుడు చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి. నిజానికి ఇవి ఎవరికీ తెలియని విషయాలు అటువంటి గొప్ప విషయాలని ఆయన పంచుకున్నారు ముస్లింల భావన ఇప్పుడు బయటపడింది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading