ప్రతి ఒక్కరు కూడా పెళ్లి తర్వాత సంతోషంగా ఉండాలని అనుకుంటారు. మీరు కూడా మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారా? అయితే కచ్చితంగా వీటిని పాటించండి. వ్యక్తి జీవితాన్ని పెళ్లికి ముందు పెళ్లి తర్వాత క్లియర్ గా మనం విభజించి చెప్పొచ్చు. పెళ్లికి ముందు ఉన్న చాలా విషయాలు పెళ్లి తర్వాత మారతాయి అయితే పెళ్లి తర్వాత భార్యాభర్తల సంతోషంగా ఉండాలంటే మాత్రం వీటిని అసలు మర్చిపోకూడదు. పెళ్లి తర్వాత బాధ్యతలు పెరిగిపోతాయి. అమ్మాయిలకు అయినా అబ్బాయిలకు అయినా కూడా బాధ్యతలు బాగా పెరుగుతాయి.
Advertisement
ఉద్యోగం, పనులు, స్నేహితులు ఇలా. అయితే భార్యాభర్తలు ఒకరినొకరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్ని పనులు ఉన్నా కూడా కొంత సమయాన్ని కేటాయించాలి. కలిసి మాట్లాడుకోవడం కలిసి భోజనం చేయడం వంటివి ముఖ్యం. ప్రతిరోజు కనీసం గంటసేపైనా మాట్లాడుకోవాలని అనే నియమాన్ని పెట్టుకోవాలి. ఏ సమస్యలున్నా వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించడం చాలా అవసరం పెళ్లికి ముందు కాబోయే జంట ఒకరిపట్ల ఇంకొకరు చాలా ప్రేమగా ఉంటారు.
Advertisement
ఒకరినొకరు బుజ్జగించుకోవడం ప్రేమ కురిపించడం కేరింగ్ గా ఉండడం వంటివి చేస్తారు. పెళ్లి తర్వాత కూడా ఇలానే ఉండాలి కోప్పడడం కొట్టుకోవడం వంటివి చేయకూడదు. భార్య చేసే ఏ పని అయినా భర్తకు నచ్చితే భార్యని మెచ్చుకోవడం అస్సలు మిస్ కావొద్దు. భార్య రుచిగా వండితే ప్రశంసించాలి. భార్య ఏమైనా మంచి పనులు చేస్తే ప్రశంసించాలి ఇలా భర్త నడుచుకుంటే భార్యకి సంతోషంగా ఉంటుంది భార్య భర్తల బంధం అంటే ఒక జీవితం మరొకరి చేతుల్లోకి వెళ్లినట్లే అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ భార్య భర్తలు అలా ఉండకూడదు స్పేస్ అనేది కూడా చాలా ముఖ్యం స్పేస్ లేకపోతే బంధం చాలా కష్టంగా ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!