రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కి జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ టైం లో ఆన్‌ఫీల్డ్ అంపైర్ల తో వాగ్వాదానికి దిగాడు శాంసన్. దీనితో మ్యాచ్ ఫీజులో 30 శాతం ఫైన్ వేశారు. ఇక వివరాల లోకి వెళితే.. డీప్ మిడ్వికెట్లో షాయ్ హోప్ క్యాచ్ తీసుకున్న వివాదంలో సంజూ అంపైర్లను అడిగారు. థార్డ్ అంపైర్ నిర్ణయాన్ని డీసీకి ఫేవర్‌గా ఇచ్చారు. దీనితో సంజూ ఫైర్ అయ్యాడు. మ్యాచ్ అఫీషియల్స్ తో మాటల యుద్ధం కూడా జరిగింది.
Advertisement
ఆర్టికల్ 2.8 కింద లెవల్ వన్ నేరానికి శాంసన్ పాల్పడినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు అని మ్యాచ్ ఫీజులో 30 శాతం ఫైన్ విధిస్తున్నట్లు బీసీసీఐ ప్రటకనలో తెలిపింది. మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. ఈ మ్యాచ్‌లో శాంసన్ 86 రన్స్ చేసాడు. క్యాచ్ ఔట్ అయ్యాడు. రాజస్థాన్ తో జరిగిన ఈ కీలక పోరు లో ఢిల్లీ 20 పరుగులు తేడాతో విజయాన్ని అందుకుంది.
Advertisement
Also read:
ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను నష్టానికి 221 స్కోర్ చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి, 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. 20 పరుగులు తేడాతో ఇలా ఢిల్లీ విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్ ముఖేష్ కుమార్ బంతి వేశారు. తొలి బంతికి సింగిల్ తీసిన బౌల్ట్ రెండో బంతికి క్లీన్ బౌల్ద్ అయ్యారు, రోమన్ పావెల్ మూడవ బంతికి రెండు పరుగులు, నాలుగో బంతికి ఫోర్, ఐదో బంతికి సింగిల్, చివరి బంతికి నో రన్ ఇలా రాజస్థాన్ 201 మాత్రమే స్కోర్ చేయగలిగింది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!