అక్షయ తృతీయ నాడు కొన్ని తప్పులు చేయకూడదు. అక్షయ తృతీయ విశిష్టత గురించి పద్మ పురాణం లో చెప్పబడింది. ఈరోజున చేసే పనులన్నీ కూడా ఫలిస్తాయిట వాటి ఫలితాలు ఎన్నటికీ తరగని విష్ణువు నారద మహామునితో చెప్పారు. అక్షయ తృతీయ నాడు సిరిసంపదలకి లోటు లేకుండా ఉండడం కోసం కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలట అక్షయ తృతీయ నాడు సాయంత్రం పూట ఎట్టి పరిస్థితుల్లో ఇలా చెయ్యకండి. మే 10వ తేదీన అక్షయ తృతీయ వచ్చింది. ఈరోజు చాలా మంచిది. ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వచ్చు. సిరిసంపదలు వస్తాయి.
Advertisement
బంగారం, వెండి సహా అనేక ఇతర విలువైన వస్తువుల్ని చాలామంది కొనుగోలు చేస్తూ ఉంటారు. అక్షయ తృతీయ నాడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదట. లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట సిరులను కురిపిస్తుంది. ప్లాస్టిక్, అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు వంటివి ఈ రోజు కొనుగోలు చేయకూడదు ఈ వస్తువులని రాహువు ప్రభావితం చేస్తారట.
Advertisement
Also read:
ఇటువంటివి కొనుగోలు చేయడం వలన పేదరికం వస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. అక్షయ తృతీయ నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అక్షయ తృతీయ నాడు అప్పు ఇవ్వడం వంటివి చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఈ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలని పోగొట్టుకోవడం కూడా చెడు శకునంగా భావిస్తారు సాయంత్రం పూట చీపురుతో ఇంటిని తుడవకూడదు. ఈ తప్పులు ఏమీ కూడా చేయకుండా చూసుకోండి అలానే ఇంట్లో మురికిని ఉంచకండి. ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా ఈ పనులు చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!