మోహన్ బాబు హీరోగా రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో పెద్ద రాయుడు సినిమా వచ్చింది ఈ సినిమా పెద్ద హిట్ అయింది. పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ దెబ్బకి అప్పటిదాకా ఉన్న రికార్డ్లు అన్నీ కూడా కనుమరుకైపోయాయి. ఈ మూవీలో మోహన్ బాబు పాత్ర హైలెట్ అయింది. 20 నిమిషాలు రజనీకాంత్ చేసిన పాత్రతో ఇంకో రేంజ్ కి వెళ్ళిపోయింది మూవీ. తమిళ సినిమా హక్కుల్ని రజనీకాంత్ సలహాతో కొనుగోలు చేసిన మోహన్ బాబు సొంత బ్యానర్ లోనే సినిమాని నిర్మించారు.
Advertisement
ఈ సినిమాకి పోటీగా మెగాస్టార్ చిరంజీవి తన సినిమాని రిలీజ్ చేయడంతో ఆయనకి ఇది ఒక చేదు అనుభవం మిగిల్చింది. జూన్ 15, 1995 పెద్ద రాయుడు విడుదల అయింది సినిమాపై అంచనాలు లేవు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ సినిమా ని విడుదల చేశారు చిరంజీవి సినిమా విడుదల చేయడంతో పెద్దరాయుడు సినిమా పరిస్థితి ఏంటని కంగారు పడ్డారు.
Also read:
Advertisement
Also read:
మొదటి వారంలో సీన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది సినిమా ఫలితం చూసి అంతా కంగారు పడిపోయారు. బిగ్ బాస్ మూవీ కంటే పెద్ద రాయుడు సినిమాకి మంచి క్రేజ్ రావడంతో థియేటర్లు పెరిగిన టికెట్లు కోసం జనాలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రింట్ల సంఖ్య కూడా భారీగా పెంచారు. సినిమాకి వచ్చిన డబ్బులు లెక్కపెట్టుకోవడానికి మిషన్లు కావాలి అనేంతగా కలెక్షన్లు వచ్చాయట. అప్పటిదాకా ఘరానా మొగుడు మూవీ పై ఉన్న రికార్డులన్నీ కూడా తిరిగి రాయడంతో పాటు ఈ సినిమా 39 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది మూవీలో నటించిన సౌందర్య కి కూడా మంచి పేరు వచ్చింది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!