Home » Shoban babu: పార్టీలో శోభన్‌బాబుని చూసి నవ్వుకునేవారట.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

Shoban babu: పార్టీలో శోభన్‌బాబుని చూసి నవ్వుకునేవారట.. ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా..?

by Sravya
Ad

Shoban babu: శోభన్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సోగ్గాడిగా పాపులర్ అయ్యారు శోభన్ బాబు. చివరగా 1996లో హలో గురు సినిమాలో నటించారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత కూడా శోభన్ బాబు అందానికి పడిపోయారు అంటే, ఈ లెక్కన శోభన్ బాబు ఎంత అందగాడో అందరికీ అర్థమై ఉంటుంది. వయస్సు పెరిగినా ఆయన అందం కూడా ఏ మాత్రం తగ్గలేదు. 60 ఏళ్లయినా కూడా యంగ్ గా ఉండడానికి కారణం ఏంటో ఒక సందర్భంలో శోభన్ బాబు బయటపెట్టారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. తాను బాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటారని అన్నారు.

Advertisement

ఏదైనా సరే లిమిట్ గా తింటారంట రుచిగా ఉందని నచ్చిందని ఎక్కువగా తీసుకోరట. ఆయనకి కాఫీ తాగాలని ఉండేది. కానీ రోజు రెండు పూట్ల మాత్రమే తాగే వారట. టీ బాగుందని అతిగా తీసుకునేవారు కాదట. ఏదైనా సరే లిమిట్ గా తీసుకుంటారట. యోగా తన ఫిట్నెస్ కి చాలా బాగా ఉపయోగపడిందని శోభన్ బాబు అన్నారు. యోగా చేస్తుంటే ఆకాశంలో విహరిస్తున్నట్లు ఉందని శోభన్ బాబు చెప్పారు. మానసిక ప్రశాంతతను ఇస్తుందని, మనసుని ఉల్లాసంగా మారుస్తుందని ఆయన అన్నారు.

Advertisement

shoban babu rejected athadu movie

shoban babu rejected athadu movie

యోగ మరో ప్రపంచం లోకి తీసుకెళ్తుందని దాన్ని కనిపెట్టిన వాళ్ళకి మొక్కాలని శోభన్ బాబు ప్రశంసించారు. మద్యపానం ధూమపానానికి దూరంగా ఉంటానని పార్టీలో పాల్గొనేటప్పుడు హీరోయిన్లు ఆయనను చూసి నవ్వుకునే వారట. మిగిలిన హీరోలు, హీరోయిన్లు డ్రింక్స్ తీసుకునేవారు కానీ నేను ఆల్కహాల్ కి దూరంగా వుంటాను అన్నారు. కొంతమంది హీరోయిన్లు ఆల్కహాల్ కంటెంట్ తక్కువగా ఉండే డ్రింక్స్ ని తాగేవారట. శోభన్ బాబు అటువంటివి కూడా తీసుకునేవారు కాదట. ఇలా ఏమీ తాగకుండా ఉంటే అందరూ నవ్వుకునే వారిని శోభన్ బాబు అన్నారు. ఇలా అన్నిటినీ కంట్రోల్ చేసుకుని మనసు మీ కంట్రోల్ చేసుకుని శోభన్ బాబు ఉండేవారు అదే తన ఫిట్నెస్ కి సీక్రెట్ అని అన్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading