మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒక రోజు చనిపోతాడు. పుట్టుక చావు అనేవి మన చేతుల్లో అసలు ఉండవు మన కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితులు అలానే బంధువులు ఎవరైనా చనిపోతే మనకి చాలా బాధ కలుగుతుంది. నిజానికి అది ఎంత బాధ అంటే అనుభవించిన వాళ్ళకి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది. నిజానికి అది వర్ణించలేనిది అని చెప్పొచ్చు. మరణించిన వ్యక్తి వాడిన వస్తువులని మనం ఇతరులకి ఇస్తూ ఉంటాం. దానం చేస్తూ ఉంటాం కొంతమంది వారి గుర్తుగా కొన్ని వస్తువులను దాచిపెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది పడేస్తూ ఉంటారు. మరణించిన వ్యక్తి తాలూకా ఈ మూడు వస్తువుల్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించవద్దు.
Advertisement
మరణించిన వాళ్ళ ఆభరణాలని ఇతరులు ఎప్పుడు వాడకూడదు బంగారం వెండి లేదంటే ఏ ఇతర లోహాలతో చేసిన ఆభరణాలైనా సరే వ్యక్తి మరణించినప్పటికీ వారి ఆత్మ అభరణాల మీద మక్కువ చూపిస్తుంది. గరుడ పురాణం ప్రకారం ఆభరణాలని ధరించిన వాళ్ళకి ఆత్మ ఆవహిస్తుందని అంటారు. ఒకవేళ ఆభరణాలను తిరిగి వాడుకోవాలంటే కరిగించి వాటితో కొత్త ఆభరణాలు చేయించి వాడుకోవడం మంచిది ఇలా చేస్తే ఏ ఇబ్బంది ఉండదు.
Advertisement
Also read:
Also read:
అలానే మరణించిన వ్యక్తి తాలూకా దుస్తులు కూడా వేసుకోవడం మంచిది కాదు. మరణించిన వారి దుస్తులను దానం చేయాలి ఇలా దానం చేస్తే ఆత్మకి మోక్షం కలుగుతుంది దానం ఇవ్వకుండా మరణించిన వారి వ్యక్తుల దుస్తులను ధరించినట్లయితే ఆత్మ దుస్తుల్ని ధరించిన వారిని ఆవహిస్తుందని గరుడ పురాణం ప్రకారం చెప్పబడింది. మరణించిన వారి వాచీలని కూడా వాడుకోకూడదు. మరణించిన వారి సానుకూల ప్రతికూల శక్తులు గడియారంలో ఉంటాయి మరణించిన వారి గడియారాలని ధరించడం వలన ప్రతికూల శక్తి వాచి ధరించిన వారి వారు ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ తప్పులు చేయకుండా చూసుకోండి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!