Home » 37 ఏళ్ల క్రితం నాటి రెస్టారెంట్ బిల్ ఇది.. చూసారంటే మాత్రం అవాక్ అయ్యిపోతారు…!

37 ఏళ్ల క్రితం నాటి రెస్టారెంట్ బిల్ ఇది.. చూసారంటే మాత్రం అవాక్ అయ్యిపోతారు…!

by Sravya
Ad

ఈరోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అంటూ పాత విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని వార్తలు చూసామంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇదివరకు ధరలు కంటే ఇప్పుడు ధరలు బాగా ఎక్కువగా ఉన్న విషయం మనకి తెలుసు. ఇప్పుడు ఏదైనా హోటల్ కి వెళ్లి ఒక భోజనం లేదా టిఫిన్ వంటివి తీసుకోవాలంటే హోటల్ రేంజ్ బట్టి ఒక మనిషికి కచ్చితంగా 500 వరకు అవుతుంది. స్టార్ హోటల్స్ కి వెళ్ళామంటే బిల్లు తడిసి మోపుడవుతుంది. నలుగురు ఐదుగురు వెళ్ళామంటే ఖచ్చితంగా ఒక మూడు నాలుగు వేలు సమర్పించుకోవాల్సి ఉంటుంది. కానీ 37 ఏళ్ల క్రితం నాటి బిల్లుని చూసారంటే కచ్చితంగా షాక్ అవుతారు.

Advertisement

ప్రస్తుతం ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలోని నజీజ్ రెస్టారెంట్ అండ్ హోటల్ 1985 డిసెంబర్ 20 నాటి బిల్లు ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన వాళ్ళందరూ షాక్ అవుతారు ఒకసారి ఆ బిల్లును పరిశీలించినట్లయితే ఒక కస్టమర్ ఒక ప్లేట్ దాల్ మఖని, రైత, కొన్ని చపాతీలని ఆర్డర్ చేసుకున్నాడు. వాటి బిల్లు కేవలం 26 రూపాయలు మాత్రమే అయింది.

Advertisement

షాహి పన్నీర్ 8 రూపాయలు, దాల్ మఖని ఐదు రూపాయలు, రైత అయిదు రూపాయలు, రోటీలు ఆరు మొత్తం 26 రూపాయలు మాత్రమే అయింది. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు ఇప్పుడు కనుక మనం హోటల్ కి వెళ్లి ఇవే ఆర్డర్ చేస్తే కచ్చితంగా మనకి వెయ్యి రూపాయల వరకు అవుతుందని అందరూ అభిప్రాయాన్ని చెప్తున్నారు అప్పుడు బిల్లులు చాలా తక్కువగా అయ్యేవని ధరలు బాగా తక్కువ ఉండేవని ఆ రోజులే బాగున్నాయని అందరూ కామెంట్లు చూస్తున్నారు. 30 రూపాయలకు ఇప్పుడు ఏం వస్తున్నాయని అందరూ అంటున్నారు ఈ రోజుల్లో ఒక రెస్టారెంట్ కి వెళ్తే చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుందని అప్పుడే రోజులు బాగుండేవని అందరూ అంటున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading