బండారు శ్రావణి పేరు ఇప్పుడు ఎక్కువగా వినపడుతోంది. శింగనమల టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి గురించి అందరూ చెప్పుకుంటున్నారు. అసలు ఈమె ఎవరు, ఈమె గురించి చాలామందికి తెలియని విషయాలు ఈరోజు చూద్దాం. అనంతపురం జిల్లా శింగనమల నుండి టీడీపీ అభ్యర్థిగా బండారు శ్రావణి పోటీ చేస్తోంది. చిన్న వయసులోనే బండారు శ్రావణి రాజకీయాల్లోకి రావడంతో ఆమె మీద అందరి ఫోకస్ పడింది. గతంలో ఒకసారి ఓడిపోయిన కూడా మళ్లీ అదే నియోజకవర్గ నుండి ఆమె పోటీ చేస్తున్నారు. ప్రజాగణం సభలో కూడా ఈమె మాట్లాడి ఒక్కసారిగా వార్తల్లో నిలిచిపోయారు. బలమైన రాజకీయ నేపథ్యం నుండి వచ్చిన ఆమె తాతయ్య తండ్రి కూడా ఎమ్మెల్యే టికెట్లని కోల్పోయారు. కానీ ఈమె మాత్రం ఎమ్మెల్యే టికెట్ ని సంపాదించుకుంది.
అలానే ఆమె కచ్చితంగా గెలుస్తానన్న నమ్మకంతో పోటీ చేస్తున్నారు ప్రజల నుండి కూడా ఆమెకి మంచి స్పందన లభిస్తోంది. తన నవ్వుతో అందరినీ పలకరిస్తూ ఆకట్టుకుంటోంది బండారు శ్రావణి. ప్రజలకి నిరంతరం సేవ చేయాలన్న దృక్పథంతో పదవిలో ఉన్న లేకపోయినా కూడా ఆమె తన సహకారాన్ని అందిస్తోంది. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి బండారు శ్రావణి ఎప్పుడు ముందే ఉంటున్నారు. 1990 ఆగస్టు మూడున ఈమె జన్మించారు తన కుటుంబ సభ్యులు రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువ చూపించడంతో ఈమెకి కూడా రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువ కలిగింది.
Advertisement
Advertisement
Also read:
- ఫ్యామిలీ సినిమా అని చెప్పి ఇలాంటివి యాడ్ చేసారు ఏందయ్యా ..?
- Family Star Review: ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ దేవరకొండ హిట్ కొట్టేసాడా..?
- Gaami OTT Release Date and OTT Platform When And Where To Watch Movie
దీంతో ఆమె ఇంతవరకు తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. ఈమె మాస్ కమ్యూనికేషన్స్ లో ఎంఏ పూర్తి చేశారు. అలానే మరో పీజీ ని కూడా పూర్తి చేశారు ఈమె మంచి విద్యార్థి కావడంతో యువత ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈమెకి బాగా తెలుసు శింగనమల ప్రాంతంలో సమస్యలను చూసి ట్రస్ట్ ద్వారా తన సహాయాన్ని అందించారు ఎన్నో స్కూళ్ళకి తాగునీటిని కూడా అందించారు. నిరుపేద యువతీ యువకులకు కూడా బండారు శ్రావణి కుటుంబం వివాహాలు జరిపించారు. ఇలా శ్రావణి ఎప్పటినుండో ఎంతో మంచి పేరు తెచ్చుకుంటున్నారు ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ఆమె బరిలో నిలబడ్డారు మరి ఈసారి ఈ బండారు శ్రావణి విజయాన్ని అందుకుంటారా లేదా అనేది చూడాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!