Jagan: సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎవరికీ తెలియని విషయాలు కూడా ఒక్కసారిగా వైరల్ అయిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా సోషల్ మీడియాలో మనకి కనబడుతూ ఉంటాయి. వైసిపి అధినేత సీఎం జగన్ మీద రాజకీయ ప్రత్యర్థులు చాలానే ఆరోపణలు చూశారు. జగన్ సీఎం అవ్వకముందు ఒక అవినీతిపరుడని జైలుకు వెళ్లారని కూడా అన్నారు జగన్ కి సంబంధించిన విద్య గురించి కూడా విపక్షాలు ఆయన మీద మాటలు దాడి చేశాయి. జగన్ ఏం చదివారో ఎక్కడ చదివారు ఎవరికీ తెలియదని అసెంబ్లీలో చాలా మాటలు అన్నారు. చంద్రబాబు కౌంటర్ ఇస్తూ జగన్ తాను ఎక్కడ చదివానో ఎన్ని మార్కులు వచ్చాయో వివరించారు.
టెన్త్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. జగన్ ఇంటర్లో డిగ్రీలో కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏ. తన మార్కులు చూస్తే షాక్ అవుతారు చంద్రబాబు పై జగన్ మండిపడి ఈ విషయాలని వెల్లడించారు. సీఎం జగన్ డిగ్రీ కి సంబంధించిన మార్క్ లిస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ డిగ్రీ సర్టిఫికెట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సీఎం జగన్ ప్రగతి మహావిద్యాలయంలో డిగ్రీని పూర్తి చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్ చదువుకున్నారు. కామర్స్ ప్రధాన సబ్జెక్టుగా మూడేళ్లు డిగ్రీ ని పూర్తి చేశారు.
Advertisement
Advertisement
చంద్రబాబు ఆరోపించినట్లు జగన్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయితే కాదు డిగ్రీలో జగన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. 740 మార్కులు వచ్చాయి జగన్ కి. 1994 జూన్ 17న మార్కుల జాబితా ని ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ కళాశాల ఇచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఇది పనిచేస్తుంది. ఈ మార్కుల జాబితాలో జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు కూడా క్లియర్ గా ఉంది. బిజినెస్ రిలేటెడ్ డిగ్రీ పూర్తి చేయడంతో ముందు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడు జగన్. తర్వాత 2009లో పాలిటిక్స్లోకి వచ్చారు. కడప ఎంపీగా పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. తండ్రి మరణం తర్వాత సొంతంగా వైసిపి పార్టీని స్థాపించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!