Relationship: పెళ్లి తర్వాత భార్య భర్త సంతోషంగా జీవించాలని అనుకుంటూ ఉంటారు. కష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గౌరవించుకుంటూ వెళ్తే జీవితం అద్భుతంగా సాగుతుంది. అంతేకానీ ప్రతి చిన్న విషయాన్ని అనవసరంగా సాగ తీసుకుంటూ వెళ్లడం పట్టించుకోవడం ఒకరినొకరు గౌరవించుకోకపోవడం ఇటువంటివి తప్పు ఇదిలా ఉంటే కొంతమంది భార్యాభర్తల మధ్య రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా భర్త మరొక స్త్రీకి దగ్గర అవడం వంటివి భార్య కంటే మరొక స్త్రీ అందంగా ఉండడం కాన్ఫిడెంట్ గా మాట్లాడటం లేదంటే భార్య కంటే పరస్త్రీ నచ్చడం, ఆ పరస్త్రీ మీద ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉండడం ఆపలేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.
Advertisement
ఆమెలో ఎక్కువ సుగుణాలు కనబడుతుంటాయి ఆమె మాట్లాడుతూ ఉంటే వినాలని అనిపించడం ఇద్దరికీ మధ్య అండర్స్టాండింగ్ ఉండడం ఇటువంటివి జరిగి భార్య కంటే ఆమెకి దగ్గర అవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు ఏం చేయాలి, ఇలా జరిగితే ఖచ్చితంగా మీరు చేస్తున్నది తప్పు అని మీరు గ్రహించాలి. వివాహ జీవితంలో నమ్మకం నిబద్ధత చాలా అవసరం. నిబద్ధత చెదిరి మీరు మరికొందరి పట్ల ఆకర్షితులు అయిపోతూ ఉంటారు. భార్యకి తెలిస్తే మీ కుటుంబ జీవితం ఎంతలా నాశనం అవుతుందో ఒకసారి ఊహించుకోండి.
Advertisement
తల్లిదండ్రులు అన్నదమ్ముల ముందు అస్సలు తలెత్తుకోలేరు సంఘంలో మర్యాద కూడా ఉండదు. ఒకరికి ఆకర్షతులయ్యేంత బలహీనమైనదా మీ మనస్తత్వం అని ఒకసారి ఆలోచించుకోండి..? పెళ్లయిన తర్వాత భార్య అందంగా ఉన్నా లేకపోయినా ఆమెతోనే జీవితాంతం గడపాలి..? మీ భార్య మీ కోసం చేసే పనులు ఏవి కూడా ఆకర్షణంగా కనబడట్లేదా ఒకసారి ఆలోచించండి. మీ భార్యలో ఉన్న మనిషి గుణాలు గురించి మీరు తలుచుకుంటూ ఉండండి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది మీ భార్యలో టాలెంట్ ఏంటో మీరు గుర్తించండి మీరు తల్లిని ఎలా చూస్తారో పరస్త్రీని కూడా అలానే చూడాలి పరస్త్రీ అందాన్ని కానీ మాట తీరుని కానీ చూసి మోహించద్దు. ఇటువంటి బలహీన మనస్తత్వం భవిష్యత్తుకి ప్రమాదకరం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!