ఈ ఫోటో నాగర్ కర్నూలు జిల్లాలోని, పెద్దకొత్తపల్లి మండలంలోని మారుమూల గ్రామమైన మారేడు మాన్ దిన్నె లో తీయబడింది. ఆ గ్రామానికి చెందిన రైతు గోపయ్య తన వ్యవసాయ పొలంలో పండించిన బొప్పాయి పండ్లను తనకు దగ్గరగా ఉండే కొల్లాపూర్ పట్టణంలో అమ్ముకుంటాడు. దీని కోసం తమ ఊరిమీదుగా వెళ్లే RTC బస్ పైనే ఆధారపడతాడు. ఇలా అనేక రోజులుగా అదే బస్ లో వెళ్లడం, మళ్లీ తిరిగి రావడం జరుగుతుంది.
రోజువారీగా శుక్రవారం బొప్పాయి పండ్లను బస్సులో తీసుకువెళ్లేందుకు రోడ్డుపై పెట్టుకోగా, తనకు ఉచితంగా బొప్పాయి పండ్లు ఇవ్వలేదన్న కోపంతో ఆ బస్సు డ్రైవర్ ఆ రైతును బస్సులోకి ఎక్కించుకోకుండానే వెళ్ళిపోయాడు ! దీంతో ఆవేదన చెందిన గోపయ్య బస్ కొల్లాపూర్ నుండి తమ గ్రామం మీదుగా వెళ్లే సమయంలో ఇలా తన బొప్పాయి పండ్ల బుట్టలను రోడ్డుకు అడ్డుగా పెట్టి కూర్చొని గంట సేపు నిరసన చేశాడు. ఈ విషయం తన దృష్టికి రాగానే RTC MD సజ్జనార్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నానని తప్పు జరిగిందని రుజువైతే డ్రైవర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Advertisement