Home » ఎన్టీఆర్‌, కృష్ణ మధ్య పదేళ్ళు మాటలు లేకపోవడానికి కారణం తెలుసా..?

ఎన్టీఆర్‌, కృష్ణ మధ్య పదేళ్ళు మాటలు లేకపోవడానికి కారణం తెలుసా..?

by Sravya
Ad

సినీ ఇండస్ట్రీ లో కొన్ని సంఘటనలు చిత్రంగా జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి హీరోల మధ్య ఏర్పడే అభిప్రాయ బేధాల గురించి మనకి తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సంఘటన నటరత్న ఎన్టీ రామారావు సూపర్ స్టార్ కృష్ణల మధ్య చోటుచేసుకుంది నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో తీస్తానని ఒక పబ్లిక్ ఫంక్షన్లో అనౌన్స్ చేశారు కృష్ణ. తర్వాత ఒకరోజు కృష్ణకి ఎన్టీఆర్ ఫోన్ చేసి బ్రదర్ నాతో సినిమా తీస్తాను అన్నారు కాల్ షీట్ ఇస్తాను చేస్తారా అని అడిగారు. దేవుడు చేసిన మనుషులు సినిమాని చేయడానికి కృష్ణ సిద్ధమవుతున్నారు ఆ టైంలో కృష్ణ ద్విపాత్రభినయం చేయాలనే ఉద్దేశంతో కథని రెడీ చేయించారు ఎన్టీఆర్ చేస్తానన్నారు కనుక ఆ కథలో కొన్ని మార్పులు చేసారు.

వీటిని కూడా చదవండి: 20 ఏళ్ల క్రితం హీరోయిన్ శ్రియా కి నాగార్జున చేసిన సాయం ఏంటో మీకు తెలుసా ?

Advertisement

తర్వాత కొన్ని రోజులకి అక్కినేనితో దేవదాసు సినిమా నిర్మించిన బి ఎల్ నారాయణ అల్లూరి సీతారామరాజు సినిమాని శోభన్ బాబుతో చేస్తానని ప్రకటించారు. ఇంకో సినిమా కోసం కృష్ణ దగ్గరికి వచ్చారు డిఎల్. ఆ టైంలో మరో సినిమా చేయడం ఎందుకు అల్లూరి సీతారామరాజు సినిమా నాతో చేయొచ్చు కదా అని అడిగారు కృష్ణ. మహారధిని పిలిపించారు. మహారధి స్క్రిప్ట్ వద్దు నేను రీసెర్చ్ చేసే కథ రెడీ చేస్తాను అని అన్నారు. మరుసటి రోజు అల్లూరి సీతారామరాజు సినిమా చేయబోతున్నట్లు కృష్ణ ప్రకటించారు. ఇది తెలుసుకున్నా ఎన్టీఆర్ కృష్ణ ని పిలిపించారు. అల్లూరి సీతారామరాజు సినిమా చేస్తున్నారట అది మేము చేయాలనుకున్నామని అన్నారు. దానికి కృష్ణ మీరు చేస్తానంటే నేను మానేస్తాను అని అన్నారు కానీ ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోలేదు. నేను చేద్దామనుకున్నాను కానీ చేయట్లేదు మీరు కూడా చేయొద్దు అన్నారు. అలా అనడానికి రీజన్ ఏంటంటే కాషాయవస్త్రాలు కట్టుకొని అడవుల్లో తిరిగే క్యారెక్టర్ అది. ఆ సినిమా ఆడదు అన్న ఉద్దేశం తో ఎన్టీఆర్ అలా చెప్పిన కూడా కృష్ణ సినిమా చేశారు.

Advertisement

వీటిని కూడా చదవండి: కె.రాఘవేంద్రరావు బి.ఎ. వెనుక ఇంత స్టోరీ ఉందని తెలుసా..?

ntr-and-krishna

దీంతో ఎన్టీఆర్ కి కోపం వచ్చి మాట్లాడడం మానేశారు తర్వాత జరిగిన దేవుడు చేసిన మనుషులు శత దినోత్సవానికి కూడా ఆయన రాలేదు అల్లూరి సీతారామరాజు రిలీజ్ అయిన పదేళ్ల తర్వాత పరుచూరి బ్రదర్స్ ని పిలిపించి సినిమాని తాను చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. పరుచూరి బ్రదర్స్ కృష్ణ గారు చేసిన అల్లూరి సీతారామరాజు సినిమాని మీరు ఒకసారి చూడండి అని సలహా ఇచ్చారు. ఎన్టీఆర్ కృష్ణ మాట్లాడుకోవట్లేదు పదేళ్ల అయిపోయింది కానీ కృష్ణని ఎన్టీఆర్ పిలిచి అల్లూరి సీతారామరాజు సినిమాని మాకు చూపించండి. పక్కనే మీరు ఉండాలి అన్నారు. తర్వాత రోజు ఒక డబ్బింగ్ థియేటర్లో సినిమా వేసి దగ్గర ఉన్న ఆయనకి చూపించారు కృష్ణ సినిమా అంతా చూసి కృష్ణ భుజం తట్టి చాలా అద్భుతంగా చేశారని మెచ్చుకున్నారు కృష్ణ చేసిన తర్వాత సినిమా ఎవరు చేసిన అంత ఇంపాక్ట్ రాదని అన్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading