హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. మంచు మనోజ్ అందరికి సుపరిచితమే. సినిమాల ద్వారా మంచు మనోజ్ మనకి దగ్గరయ్యారు. సినీ ఇండస్ట్రీ లోకి స్టార్ హీరో ఫ్యామిలీ నుండి హీరోగా అడుగుపెట్టిన మంచు మనోజ్ ఎంతో మంచి సక్సెస్ ని అందుకున్నారు. గతంలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో మంచు మనోజ్ నటించారు కొన్ని కారణాల వలన మనోజ్ కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరం అయిపోయారు కానీ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఎంతో అద్భుతంగా కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఒకవైపు సినిమాలు చేస్తూ ఇంకోపక్క బుల్లితెర కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా మంచు మనోజ్ వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉంటున్నారు మనోజ్.
Advertisement
Advertisement
గత ఏడాది మార్చి మూడున భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరికీ ఇది రెండవ పెళ్లి. భూమ మౌనిక రెడ్డి ఇదివరకే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చారు అయితే వీళ్ళిద్దరికీ వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. మనోజ్ కూడా ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. తర్వాత రెండేళ్లకి వీళ్ళు విడిపోయారు. ఇలా ఒంటరిగా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ ప్రేమలో పడడం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది వీళ్ళిద్దరి వివాహం తర్వాత ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
మనోజ్ కొద్దిరోజుల క్రితం తను తండ్రి కాబోతున్నానన్న విషయాన్ని తెలియజేశారు. మౌనిక ప్రెగ్నెన్సీ గురించి ఎప్పటికప్పుడు అన్ని విషయాలని ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు ఇటీవల మనోజ్ కవల పిల్లలకి తండ్రి అయ్యారని వార్తలు రాగా మనోజ్ కొట్టిపారేశారు. మౌనిక ప్రస్తుతం ఏడవ నెల గర్భంలో ఉందని చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏడవ నెల ప్రెగ్నెన్సీ తో ఉన్నటువంటి భూమ మౌనికకి ఘనంగా సాంప్రదాయపద్ధంగా సీమంతపు వేడుకలు జరిగాయి నంద్యాలలోనే తన బంధువుల సమక్షంలో ఈ వేడుకలు జరిగాయని తెలుస్తోంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!