Home » Loksabha Election: హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలకు ఎన్నికల సందర్భంగా పెరిగిన డిమాండ్..!

Loksabha Election: హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలకు ఎన్నికల సందర్భంగా పెరిగిన డిమాండ్..!

by Sravya
Ad

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్నికల మీద చర్చలు జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్లు చార్టెడ్ ఫ్లైట్స్ కూడా సిద్ధమయ్యాయి. హెలికాప్టర్లకి చార్టెడ్ విమానాలకి డిమాండ్ బాగా ఉంది వాటి అద్దె ఎంతో తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారా..? మరి వాటి అదే వివరాలను ఇప్పుడు చూద్దాం ఎన్నికల తేదీ ప్రకటించక ముందే రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాని విడుదల చేసి ప్రచారాన్ని ప్రారంభించాయి. ఇంకో పక్క ముఖ్యమైన నేతల ప్రమోషన్ కోసం హెలికాప్టర్లు చార్టెడ్ ఫ్లైట్స్ బుక్ అవుతున్నాయి. అభ్యర్థులకి పార్టీ నేతలకి ఎన్నికల ప్రచారం అనేది చిన్న విషయం కాదు. తక్కువ సమయం లోనే ఎక్కువ ప్రదేశాలకు సందర్శించి ప్రచారం చేయాలి.

Advertisement

Advertisement

జాతీయ పార్టీల నుండి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని పార్టీల నేతలు కూడా ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్ లని అద్దెకి తీసుకుంటున్నారు. దీంతో ఈ హెలికాప్టర్ల కి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుత హెలికాప్టర్ అద్దె ధర ఎంతో తెలుసా..? చార్టెడ్ విమాన చార్జీలు గంటకి నాలుగున్నర లక్షల నుండి ఐదున్నర లక్షలు వరకు ఉన్నట్లు తెలుస్తోంది గంటకి లక్షన్నర నుండి హెలికాప్టర్ అద్దెకి మూడున్నర లక్షల వరకు అవుతుంది. దేశంలో 350 చాటెడ్ విమానాలు, 175 హెలికాప్టర్లు ఉన్నాయి.

జాతీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాయి. రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్న ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలని మొదలుపెట్టాయి అదే విధంగా పలు ప్రాజెక్టులకు కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. హెలికాప్టర్లు చార్టెడ్ విమానాలు అద్దె కి అందుబాటులో ఉన్నాయి కనుక నోటిఫికేషన్ తర్వాత మాత్రమే వాటి వినియోగం పెరిగింది ఎన్నికల కోసం పార్టీల ఖర్చులకి ఈసారి చార్టెడ్ ఫ్లైట్ హెలికాప్టర్ అదే కూడా వారికి తోడైంది ప్రచార బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతుంది. హెలికాప్టర్ చార్టెడ్ విమానాలని ఉపయోగించి అభ్యర్థులు మొత్తం ఖర్చు సమాచారాన్ని ఎన్నికల కమిషన్ కి సమర్పించాల్సి ఉంటుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading