Home » Cotton candy: కాటన్‌ క్యాండీ, గోబీ మంచురియాపై నిషేధం..? ఎందుకంటే..?

Cotton candy: కాటన్‌ క్యాండీ, గోబీ మంచురియాపై నిషేధం..? ఎందుకంటే..?

by Sravya
Ad

Cotton candy: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం కాటన్ క్యాండీ గురించి చూసాము. కాటన్ క్యాండీని పలు రాష్ట్రాలు ఇప్పటికే నిషేధించాయి కర్ణాటకలోని కాటన్ క్యాండీ, గోబీ మంచూరియాని బ్యాన్ చేసేసారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విక్రయాలని నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఈ ఆహార పదార్థాలను నిషేధించడానికి ముఖ్య కారణం కృత్రిమ రంగులు రసాయనాలు అని తెలుస్తోంది. ఈ కృత్రిమ రంగులు, రసాయనాల కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉండడంతో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.

Advertisement

Advertisement

ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండురావు ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గోబీ మంచూరియ, కాటన్ కండి కృత్రిమ రంగుల వాడకం నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే ఏడేళ్లు జైలు శిక్ష పది లక్షల వరకు జరిమానా విధిస్తామని అన్నారు. గోబీ మంచూరియన్, కాటన్ క్యాండీలో నాసిరకం నాణ్యత, కృత్రిమ రంగులు ఉన్నాయని అన్నారు.

అయితే వీటిపై ఆరోపణలు ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి నమూనాలని సేకరించి టెస్ట్ కి తరలించినట్లు చెప్పారు. గోబీ మంచూరియా నుండి సేకరించిన నమూనాల్లో చాలా వాటిలో కృతులు కృత్రిమ రంగులు ఉన్నట్లు గుర్తించారు. సేకరించిన 25 కాటన్ క్యాండీ నమూనాలలో 15 నమూనాల్లో కృత్రిమ రంగులు కనపడ్డాయని వెల్లడించారు. గోబీ మంచూరియన్, కాటన్ క్యాండిల్ లో రోడమెయిన్ బి తో సహా నిషేధించబడిన కృత్రిమ రంగులు ఉపయోగించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading