Home » Sr Ntr: సీనియర్ ఎన్టీఆర్ చనిపోవడానికి ముందు రోజు ఏం జరిగిందో తెలుసా..?

Sr Ntr: సీనియర్ ఎన్టీఆర్ చనిపోవడానికి ముందు రోజు ఏం జరిగిందో తెలుసా..?

by Sravya
Published: Last Updated on
Ad

Sr Ntr: నందమూరి తారక రామారావు గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. నందమూరి తారక రామారావు ఇండస్ట్రీ లోకి వచ్చి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు రాజకీయాల ద్వారా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు ఎంతోమంది ప్రజలకి సేవ చేశారు ఎన్టీఆర్. అలానే పౌరాణిక పాత్రలు చేయడంలో ఎన్టీఆర్ పెట్టింది పేరు. అయితే ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి ఇప్పుడు కూడా మనకి అప్పుడప్పుడు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తెలియని విషయాలని ఫాన్స్ చూసి విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ntr

Advertisement

 

ఎన్టీఆర్ చనిపోవడానికి ముందు ఏం జరిగింది..? ఆరోగ్యంగా ఉన్న ఎన్టీఆర్ ఎలా చనిపోయారు అనే విషయాలను చూస్తే.. హఠాత్తుగా ఎన్టీఆర్ ఎందుకు చనిపోయారు. చనిపోవడానికి ముందు రోజు ఎన్టీఆర్ ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్ తన ఆరోగ్యం గురించి కూడా చెప్పారు ఆరోగ్య కారణాల వలన రాబోతున్న లోక్సభ ఎన్నికల ప్రచారానికి రానని కొందరు అంటున్నారని ఆయన విమర్శించారు. రెండు మూత్రపిండాలకి డయాలసిస్ జరగడంతో ఆరోగ్యం క్షీణించింది అని కొందరు ప్రచారం చేస్తున్నారని, నమ్మవద్దు అని ఎన్టీఆర్ చెప్పారు. 

Advertisement

మీ ముందు మైక్ లో మాట్లాడుతున్న నేను ఆరోగ్యంగానే ఉన్నాను అన్నారు. ఆ రోజు రాత్రి 7 నుండి 9 వరకు టీడీపీ నేత పీవీ మోహన రెడ్డితో ఎన్టీఆర్ సమయాన్ని గడిపారు ఎన్టీఆర్ క్రమశిక్షణ గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. ఎప్పటిలానే ఎన్టీఆర్ ఆ రోజు కూడా లేచి క్రమశిక్షణతో వ్యాయామ కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ టైంలో ఆయనకి గుండె నొప్పి వచ్చింది లక్ష్మీపార్వతి కి చెప్తే వెంటనే ఆమె డాక్టర్ కి ఫోన్ చేసి చెప్పారు. ఏమీ లాభం లేకపోయింది. ఎన్టీఆర్ చనిపోయారు. వేలాది మంది ప్రజలు ఎన్టీఆర్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. 1996 జనవరి 18న ఇదంతా జరిగింది. ఎంతోమంది ఆయన మరణ వార్త విని కృంగిపోయారు. ఆయన మరణం తెలుగు ప్రేక్షకులకు తీరని లోటు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading