విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన గామీ సినిమాకు రెస్పాన్స్ బాగుంది. విమర్శకుల నుండి కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తక్కువ బడ్జెట్ తో సూపర్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారని ఆడియన్స్ బాగా మెచ్చుకుంటున్నారు. తెలుగు తో పాటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా వచ్చాయి. గామీ కి వ్యతిరేకంగా కొంతమంది కావాలని టార్గెట్ చేస్తూ ఒ నెగెటివిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నారు బుక్ మై షో కొన్ని బోగస్ అకౌంట్లో నుండి గామికి 1 /10 రేటింగ్ ఇస్తున్నట్లు మూవీ టీం అయితే గుర్తించింది. ఈ కారణంగా బుక్ మై షో లో మూవీ రేటింగ్ 8.3 కి పడిపోయింది. కావాలని కొంతమంది ఇలా చేస్తున్నారని అర్ధమవుతోంది. గతంలో విజయ్ దేవరకొండ ఖుషి సినిమా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి కూడా ఈ సమస్య ఎదురయింది. ఎంత కాదనుకున్నా దీని వలన సినిమాకి నష్టం వాటిల్లుతుందనేది మాత్రం నిజం.
Advertisement
Advertisement
కనుక మూవీ మేకర్స్ దీనిపై ఏదైనా లీగల్ యాక్షన్ తీసుకుంటారేమో చూడాలి. చాందిని చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. అంజి అభినయ మహమ్మద్ రెడ్డి హారిక కీలకపాత్రలు ఈ సినిమాల్లో పోషించారు కార్తిక్ సబరీష్ నిర్మించారు. అఘోరాగా గామి సినిమాలో విశ్వక్సేన్ నటించారు ఒక మానసిక సమస్యతో బాధపడే అగోరాని ఆశ్రమం నుండి గురువు వెళ్ళిపోమనడం తర్వాత కాశీకి చేరుకున్న అతని కథ ఎటువంటి మార్పులు తిరిగింది అనేది ఈ సినిమా కథ.
మినిమం బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి వి సెల్యులాయిడ్ అనే బ్యానర్ ని మొదలుపెట్టిన సంగతి మనకి తెలుసు అందులో భాగంగా గామి సినిమాని తీశారు హిమాలయాల్లో విశ్వక్సేన్ సింహం వెంటే సీన్ అదిరిపోయిందని ఎక్కువ మంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ ఒక్క సీన్ చాలు థియేటర్లకి వెళ్లడానికి అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. గామి తప్పక చూడాల్సిన సినిమా అని నెటిజెన్స్ భావిస్తున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!