Chiranjeevi wife Surekha: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi wife Surekha) గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు చిరంజీవి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. తర్వాత మంచి పేరు తెచ్చుకున్నారు ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. చిరంజీవి ఇప్పుడు కూడా గట్టి పోటీ ఇస్తూ సినిమాల్లో నటిస్తున్నారు వరుస పెట్టి సినిమాలో చేస్తూ దూసుకు వెళ్ళిపోతున్నారు చిరంజీవి భార్య సురేఖ గురించి కూడా ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో వీళ్ళు కూడా ఒకరు సురేఖ చాలా వరకు సినిమా ఇండస్ట్రీకి అలాగే సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు కేవలం పండుగ ఈవెంట్లలో మాత్రమే కనపడుతూ ఉంటారు.
ఉమెన్స్ డే సందర్భంగా ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భర్త గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి సురేఖ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గారు భోజనం విషయంలో అస్సలు ఆలోచించరు ఏది పెట్టిన తింటారు అని అన్నారు పచ్చడి అన్నం పెట్టేసిన సరే మాట్లాడకుండా తృప్తిగా తినేస్తారు. నాగబాబుకి అలా కాదు అన్ని రుచులు కావాలి అని అన్నారు. కళ్యాణ్ బాబుది వాళ్ళ అన్నయ్య వరసే ఎలాంటి డిమాండ్లు కూడా ఉండవు ఏది పెట్టినా తింటారు అని సురేఖ చెప్పారు ఇక్కడ ఒక విషయం తప్పనిసరిగా చెప్పాలి మామయ్య గారు చక్కగా తినేవాళ్లు ఆయన తినడం చూస్తే మిగిలిన వాళ్ళకి కూడా తినాలని అనిపిస్తుంది అదొక కళ అని అన్నారు సురేఖ.
Advertisement
Advertisement
అమ్మ నాకు చిన్నప్పటి నుండి అందరికీ పెట్టడం నేర్పించారు ఎవరైనా తృప్తిగా తింటుంటే ఇంకా పెట్టాలని అనిపిస్తుంది అని సురేఖ అన్నారు. పెళ్లికి ముందు వంట అసలు రాదు అని చెప్పారు ఇప్పుడు వంట చేయడంలో పర్ఫెక్ట్ అని అన్నారు సురేఖ మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేనే చిన్నదాన్ని కూరలు తరగడం వంటి చిన్న చిన్న సహాయాలు చేయడం తప్ప వండడం వచ్చేది కాదు వంటలు నా గురువు మా ఆయన అని అన్నారు మామయ్య గారు భోజనం ప్రియులు. అత్తయ్య గారు చాలా బాగా వండుతారు అని అన్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!