Home » ఛత్రపతి సినిమా టైటిల్ వెనుక ఇంత కథ వుందా..?

ఛత్రపతి సినిమా టైటిల్ వెనుక ఇంత కథ వుందా..?

by Sravya
Ad

ప్రభాస్ హీరోగా వచ్చిన ఛత్రపతి సినిమా గుర్తుందా..? కచ్చితంగా గుర్తుండే ఉంటుంది ఒక సినిమా తీయాలంటే అది చాలా ఈజీ కాదు. ఎంతో కష్టపడితే కానీ ఒక సినిమాని దర్శకుడు తెర మీదకు తీసుకురాలేరు. నటులు సహకారంతో పాటుగా అందరూ సహకారం బాగా అందించాలి అలానే సినిమా చేయడానికి దర్శకుడు కి నిర్మాత టెక్నీషియన్ల అవసరం ఉంటుంది అయితే దర్శకుడు ఇలా ఎంతో కష్టపడి సినిమాని తీసుకువస్తూ ఉంటారు ప్రభాస్ టాలీవుడ్ అగ్ర దర్శకులైన రాజమౌళి కూడా సినిమాలు చేశారు. 2005లో చూసినట్లయితే ఛత్రపతి సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా తీయడానికి కొన్ని సంవత్సరాలు నిరీక్షణ దాగి ఉంది.

Advertisement

2001లో రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా రిలీజ్ అయింది ఆ తర్వాత ఆయన రెండు సంవత్సరాలు ఖాళీగా ఉన్నారు. ప్రభాస్ అదే టైటిల్ తో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం తెలుసుకుని ఆయనతో సినిమా చేయాలని అనుకున్నారు రాజమౌళి. కాకపోతే అప్పుడు పరిస్థితులు కుదరకపోవడం వలన ప్రభాస్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా చేసి ఇండస్ట్రీలోకి వచ్చారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి 2003లో రాజమౌళి సింహాద్రి సినిమా చూశారు. ప్రభాస్ తో మూవీ చేయాలన్న కోరిక రాజమౌళికి అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత ఐదు సినిమాలు చేసిన తర్వాత రాజమౌళి ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం దక్కింది.

Advertisement

chatrapathi

chatrapathi

నిర్మాత ప్రసాద్ రాజమౌళి కుటుంబానికి చాలా సుపరిచితులు. దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న రాజమౌళితో కలిసి సినిమా చేయాలని అనుకున్నారు. నిర్మాత ప్రసాద్ రాజమౌళితో కలిసి సినిమా చేద్దామని చెప్పారు. కథ కోసం ఆలోచిస్తున్న సమయంలో 1988లో విజయేంద్రప్రసాద్ చూసిన స్కార్ రేస్ అనే సినిమా గుర్తుకు వచ్చింది. రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో సినిమాకి స్టోరీ దొరికింది. నిద్రపోతున్న భార్యని లేపి విజయేంద్రప్రసాద్ అనుకున్న కథని చెప్పారు. స్టోరీ విన్న భార్య మాత్రం అలా ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. పద్మాలయ స్టూడియోస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న గోపి కథ విని బాగుంది ఛత్రపతి అని టైటిల్ పెట్టండి అని చెప్పారట ఇలా చత్రపతి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading