టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలు ద్వారా మెజారిటీ సందర్భాల్లో వార్తల్లోకి ఎక్కిన వ్యక్తుల్లో జీవిత కూడా ఒకరు. రాజశేఖర్ కెరియర్ విషయం లో జీవిత గురించి నెటిజెన్స్ నుండి భిన్నాభిప్రాయాలు వస్తూ ఉంటాయి పలు కార్యక్రమాలకి జీవిత హోస్ట్ గా కూడా వ్యవహరించారు. రాజశేఖర్ ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. జీవిత రాజశేఖర్ కూతుళ్లు కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో జీవిత ఎటువంటి వివాదాస్పద అంశాల గురించి స్పందించట్లేదు. జీవిత తాజాగా ఒక సందర్భంలో మాట్లాడారు. నేను ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్ళు దాటిందని ఈ 30 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకుని ఎదుర్కొన్నానని జీవిత అన్నారు అయితే ఈ క్రమంలో నేను చాలా విషయాలను నేర్చుకున్నాను అని జీవిత అన్నారు.
Advertisement
Advertisement
ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం సరికాదని అలా చేస్తే కొంత మందికి నచ్చదు అన్న విషయం నాకు అర్థమైందని జీవిత తన అభిప్రాయాన్ని చెప్పారు. అన్ని అంశాల మీద మాట్లాడకపోవడం వలన నేను రాజశేఖర్ నష్టపోలేదని హాయిగా ఉన్నామని ఇప్పుడు పిల్లలు కూడా ఇండస్ట్రీ లో ఉన్నారని జీవిత అన్నారు. మేము అంటే నచ్చని వాళ్ళు వలన పిల్లలు ఇబ్బంది పడకూడదని జీవిత అన్నారు.
ప్రస్తుతం మౌనంగా ఉంటున్నాం అంటే అది భయం వలన కాదు అని ఆమె అన్నారు నేను ఏ విషయంలో కూడా భయపడట్లేదని ఆమె కామెంట్స్ చేశారు. మాతృదేవోభవ సినిమాలో ప్రధాన పాత్ర కోసం మొదట నాకు ఆఫర్ వచ్చింది. నేను అంగీకరించ లేదు అని జీవిత అన్నారు ఆ పాత్ర ని మాధవి చేశారని జీవిత అన్నారు. పెళ్లి తర్వాత యాక్టింగ్ కి దూరంగా ఉండాలని అనుకున్నానని అన్నారు నా భర్త పిల్లలు నా ప్రపంచం అనే జీవిత చెప్పారు జీవిత చెప్పిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!