Home » ఆ విషయంలో నాగార్జున పూరి కి వార్నింగ్ ఇచ్చారట..!

ఆ విషయంలో నాగార్జున పూరి కి వార్నింగ్ ఇచ్చారట..!

by Sravya
Ad

చాలామంది హీరోలు ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ ని అందుకుంటుంటారు. కొంతమంది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే కచ్చితంగా సినిమాల్లో సక్సెస్ అవ్వచ్చని ఇండస్ట్రీలో ఎంతకాలమైనా రాణించొచ్చు అని భావిస్తారు. కానీ అది నిజానికి సాధ్యం కాదు. టాలెంట్ లక్ రెండు కూడా ఉండాలి. అయితే చాలామంది హీరోలు హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చినా త్వరగానే ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు అవకాశాలు లేక ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ఇండస్ట్రీలో నిరంతరం కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ల పేర్లు చెప్పాలంటే ముందు మనకి వచ్చే గుర్తుకు వచ్చేది చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్.

Advertisement

ఎప్పటినుండో వీళ్ళు సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నారు. కుర్ర హీరోలకి ఏమాత్రం తీసి పోవట్లేదు. బాలకృష్ణ నాగార్జున తండ్రి వారసత్వాన్ని అనుసరిస్తూ ఇండస్ట్రీలోకి వచ్చారు. వీళ్లిద్దరూ కూడా స్టార్ హీరోలగా ఎదిగారు. నాగార్జున వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దమ్మున్నదర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు పూరి జగన్నాథ్. సూపర్, శివమణి వంటి సినిమాలు పూరి దర్శకత్వంలో నాగర్జున చేశారు. మంచి హిట్ని అందుకున్నారు.

Advertisement

మొదటినుండి కూడా పూరికి నాగర్జునకి మంచి అనుబంధం ఉంది పూరి జగన్నాథ్ నాగార్జున గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నాకు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారని అన్నారు అదేంటంటే మనకి ఎవరైనా కలిస్తే బాగున్నావా, ఏం చేస్తున్నావ్, తిన్నావా అని అడుగుతారు. కానీ నువ్వు ఈరోజు ఎక్సర్సైజ్ చేసావా అని ఎవరు అడుగుతారు అని ఇటువంటి విషయాలు ఎవరూ మనకి చెప్పరు. మనమే చేసుకుంటూ పోవాలని నాగార్జున పూరి జగన్నాథ్ కి చెప్పేవారట. దగ్గరుండి పూరిని జిమ్ కి తీసుకెళ్లే వారట. అలా పూరిని వరుసగా వారం రోజులు నాగార్జున జిమ్ కి తీసుకెళ్లారు నాగార్జున జిమ్ చేస్తుంటే పూరీ మాత్రం అక్కడ కూర్చునేవారట నాగార్జున కోపం వచ్చి నువ్వు తప్పకుండా రోజు ఎక్సర్సైజ్ చేయాలని వార్నింగ్ ఇచ్చారట. ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూలో చెప్పారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading