Home » పిల్లలు చెడు మాటలు మాట్లాడితే… తల్లిదండ్రులు ఏం చెయ్యాలి..?

పిల్లలు చెడు మాటలు మాట్లాడితే… తల్లిదండ్రులు ఏం చెయ్యాలి..?

by Sravya
Ad

తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చూసుకోవాలి తల్లిదండ్రులు కనుక పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోతే, పిల్లలు బాగా మొండి చేస్తూ ఉంటారు. ఏమీ వినిపించుకోరు. సరైన దారిలో వెళ్లరు. కాబట్టి ఖచ్చితంగా తల్లితండ్రులు పిల్లలపై శ్రద్ధ పెట్టాలి టైం లేకపోయినా సరే తల్లిదండ్రులు పిల్లల విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి. పిల్లలు అమాయకులు. వాళ్ళు తమ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి ఎన్నో విషయాలని నేర్చుకోవడం మొదలు పెడుతూ ఉంటారు పిల్లలకి ఇది మంచి ఇది చెడు అన్న విషయాలు తెలియదు. చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తే ఏం మాట్లాడితే అవే చేస్తూ ఉంటారు. పిల్లలు సక్రమంగా మంచిదారిలో వెళ్లాలంటే తల్లిదండ్రులు ఏది చెడు ఏది మంచి అన్నది చెప్పాలి.

Advertisement

పిల్లలు చుట్టుపక్కల వాళ్ళని చూసి ఎంతగా ఎఫెక్ట్ అవుతారో స్కూల్ నుండి ఇంటికి తిరిగి వచ్చేవరకు పిల్లలు ఎంతో మందిని కలుస్తూ ఉంటారు. ఎన్నో మాటల్ని వింటూ ఉంటారు ఎన్నో కొత్త విషయాలని నేర్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు అన్న మాటలకి అర్ధాలు తెలియకపోయినా అలాగే మాట్లాడతారు. అలానే పెద్దలు చూసి చాలా పనులు పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. పిల్లలు అసభ్యకరమైన మాటలు మాట్లాడినప్పుడు కానీ లేదంటే చెడు పనులు చేసినప్పుడు కానీ సిగ్గుగా తల్లిదండ్రులు కనిపిస్తూ ఉంటుంది తల్లిదండ్రులకి పిల్లలు చెడు పదాలను ఉపయోగించడం, చెడ్డ తీరిలో వ్యవహరించడం తో కోపం వస్తుంది దీంతో పిల్లల్ని తిట్టడం కొట్టడం చేస్తారు.

Advertisement

కానీ పిల్లల్ని కొట్టడం వలన వాళ్ళు మారరు. పిల్లలు ఎన్నో విషయాలని చెప్తారు కానీ తర్వాత మర్చిపోతారు తల్లిదండ్రులు తిట్టినప్పుడు లేదా వాళ్ళని అనకూడని మాటలు అన్నప్పుడు వాళ్ళకి అలాగే గుర్తుండిపోతాయి. మీరు అన్న పదం వాళ్ళ మనసులో నాటుకుపోతుంది కాబట్టి పిల్లలతో మాట్లాడేటప్పుడు మంచి పదాలని ఉపయోగించండి మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా ఉండేటట్టు జాగ్రత్త తీసుకోండి. అలానే అసభ్యకరంగా మాట్లాడేటప్పుడు పిల్లలను టీజ్ చేస్తూ నవ్వకూడదు. గట్టిగా చెప్పాలి. ఇటువంటి పదాలని వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటున్నారు అనేది చూసి ఆ కనెక్షన్ ని కట్ చేయండి వాళ్ళని ట్రాక్ లో పెట్టండి. ఒకసారి పెద్దలు కోపం వచ్చినప్పుడు అస్సభ్యకరమైన మాటలు మాట్లాడతారు ఇది విన్న పిల్లలు అలానే మాట్లాడుతారు సో ముందు మిమ్మల్ని మీరు కంట్రోల్ లో ఉంచుకోండి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading