ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో 2,51,209 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో 627 మంది కరోనా తో మరణించారు.
ఢిల్లీలో ఇకపై బహిరంగ మార్కెట్లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. దాంతో వ్యాక్సిన్ వేసుకోని వారు కొనుగోలు చేసి నర్సింగ్ హోమ్స్ లో నిపుణుల ఆధ్వర్యం లో వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
Advertisement
నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి ఉందని వైద్యులు తెలిపారు.
అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపింది. వైరాలజీ ల్యాబ్‌లో 8 మంది డేటా ఆపరేటర్లకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
Advertisement
నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ స్ట్రాటజీ గ్రూప్ భేటీ కానుంది. ఉదయం 10:45 గంటలకు సోనియా అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాహుల్‌గాంధీ, మన్మోహన్ సింగ్, ఏకే అంటోనీ హాజరవ్వనున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై సమావేశం లో చర్చించనున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి పులి వణికిస్తోంది. సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోఅయాయి. అర్లీటిలో 5.7, పిప్పల్ దరిలో 7 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
డ్ర* పై సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపుతున్నారు. డ్ర* నిర్మూలనకు నేడు సీఎం కేసీఆర్ అధికారులతో భేటీ అవుతున్నారు.
కర్నూల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వైసీపీ కార్యకర్తలు దారుణంగా హత్యకు గురయ్యారు.
ఏపీలో విజయవాడకి ఎన్టీఆర్ పేరు పెట్టడం పై కొడాలి నాని హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను అభిమానించే వాళ్ళ తరపున సీఎం జగన్ కు పాదాభివందనం చేస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు.
మేడారం వేడుకల కోసం 3,845 స్పెషల్ బస్సులను కేటాయించారు.