Home » కొత్త ప్రాజెక్ట్ కి రెడీ అయిన అక్కినేని అఖిల్.. ఏ సినిమా అంటే..?

కొత్త ప్రాజెక్ట్ కి రెడీ అయిన అక్కినేని అఖిల్.. ఏ సినిమా అంటే..?

by Sravya
Ad

అక్కినేని నాగార్జున తర్వాత నాగార్జున కొడుకులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరు కూడా ఇండస్ట్రీ లోకి వచ్చారు. మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు అక్కినేని ప్రిన్స్ అఖిల్ నటించిన ఒక్క మూవీ కూడా ఇప్పటిదాకా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవ్వలేదు. ఎంతో కష్టపడి చేసిన ఏజెంట్ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. హార్డ్ వర్క్ చేసి సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు అఖిల్. అయితే ఏజెంట్ మూవీ తర్వాత అక్కినేని అబ్బాయి సైలెంట్ అయిపోయాడు ఎక్కడ ఈవెంట్లలో కూడా కనిపించలేదు. ఆ మధ్య జరిగిన ప్రభాస్ సలార్ మూవీ సక్సెస్ పార్టీలో సడన్ గా కనపడ్డాడు దీంతో సలార్ రెండవ పార్ట్ లో అఖిల్ నటిస్తున్నాడని దేవా కి తమ్ముడు పాత్ర చేస్తున్నాడని వార్తలు అయితే వచ్చాయి.

Advertisement

Advertisement

మరోపక్క అఖిల్ తన నెక్స్ట్ సినిమా కోసం కొత్త దర్శకులతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కడానికి టైం పడుతుందని తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని అఖిల్ అక్కినేని ఫిక్స్ అయ్యారు. మంచి కథ కోసం చూస్తున్నారు. అందుకని ఆలస్యమైనా పరవాలేదని అనుకుంటున్నారేమో అందుకే విపరీతంగా లేట్ చేస్తున్నారు. స్లోగా స్టడీగా కొత్త ప్రాజెక్ట్ పనులు కానిస్తున్నారు. పీరియాడిక్ జోనర్ లో ఈ సినిమా తెర మీదకి రాబోతున్నట్లు తెలుస్తోంది ఖర్చు కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుందట ఈ ప్రాజెక్టు కి కావాలనే ఎక్కువ టైం తీసుకుంటున్నారు మూవీ మేకర్స్.

అఖిల్ తాజా ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైట్ టీషర్ట్ లో ఉన్న అఖిల్ తన ఫ్రెండ్ తో దిగిన ఫోటో నెట్టింట షికార్లు కొడుతోంది. అఖిల్ ఫుల్ గడ్డం పెంచుకుని ఉన్నారు. దీంతో కొత్త సినిమాలో అఖిల్ లుక్ ఇదేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు అయ్యగారు చాలా రోజులకి కనిపించారని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ బ్యాచిలర్ బ్యాచలర్ ఇలా పలు సినిమాలతో ప్రేక్షకులు ముందుకి వచ్చాడు కానీ సక్సెస్ కాలేకపోయాడు ఈసారైనా హిట్టు కొట్టాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading