చాలామందికి ఎప్పుడూ టెన్షన్ ఉంటుంది. ఎప్పుడు టెన్షన్ గా అనిపిస్తూ ఉంటోందా మీకు కూడా.. అయితే కచ్చితంగా ఈ అలవాటులని వదిలేసుకోండి. ఈ అలవాట్ల ని కనుక మీరు వదిలేసుకుంటే టెన్షన్ మాయమైపోతుంది. సామర్థ్యానికి మించి ఎక్కువ పని చేస్తే అలసిపోతూ ఉంటాము దాని వలన ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడవడంతో అది ఆగిపోదు. మిమ్మల్ని విశ్రాంతి లేకుండా చేస్తుంది. కంగారుని పెంచుతుంది సో ఎప్పుడూ కూడా మీకు ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి సామర్థ్యానికి మించి పని చేయకండి. మొహమాటం కొద్ది అన్ని పనులకి ఒకే చెప్తూ ఉంటారు చాలామంది. అలా చేయడం మంచిది కాదు దాని వలన టెన్షన్ ఎక్కువ పెట్టుకోవాలి. ఆఫీసుల్లో బాస్ చెప్పిన పనులు చేయలేక పోయినప్పటికీ మొహమాటానికి ఎస్ చెప్తూ ఉంటారు చాలామంది ఉద్యోగులు అది చాలా తప్పు.
Advertisement
Advertisement
అలానే వాయిదా వేసే పద్ధతి మానేయాలి పనులు వాయిదా వేయడం వలన ఆలస్యం అయిపోతాయి పనులు. ఈ కారణంగా టెన్షన్ పెరిగిపోతుంది. నెగటివ్ గా మాట్లాడే వారికి దూరంగా ఉండాలి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళతో ఎక్కువసేపు ఉండడం వలన ఒత్తిడి టెన్షన్ విపరీతంగా పెరిగిపోతాయి. అలానే ఎవరి గురించి వారు ఆలోచిస్తే వారికి విలువ పెరుగుతుంది. ఎప్పుడు ఇతరుల గురించి పని చేస్తూ మీ పనులు వాయిదా వేసుకోవద్దు. దీనితో టెన్షన్ పెరిగిపోతుంది.
అందరికీ అన్నివేళలా అందుబాటులో ఉండడం మానేసుకోండి మీకోసం ఈరోజు కొంచెం సమయాన్ని కేటాయించండి. రోజు కొంచెం సేపు సూర్య కాంతిలో గడపడం వలన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది విటమిన్ డి కూడా అందుతుంది. అలానే వేపుడు జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ వంటివి తీసుకోవద్దు. వీటివలన మనసుకి ఆరోగ్యం పాడవుతుంది ఇలా ఇక్కడ చెప్పినట్లు చేయడం వలన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అలానే టెన్షన్ గా ఉండేవాళ్ళు వీటిని పాటిస్తే టెన్షన్ నుండి ఫ్రీ అయిపోవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!