Home » విశ్వక్ గామి మూవీ స్టోరీ ఇదేనా..? అసలు కథ ఏమిటంటే..?

విశ్వక్ గామి మూవీ స్టోరీ ఇదేనా..? అసలు కథ ఏమిటంటే..?

by Sravya
Ad

మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రస్తుతం చేత నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. విశ్వక్సేన్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంత గానో ఎదురు చూస్తున్నారు. నాలుగేళ్లగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ శివరాత్రి కానుకగా రిలీజ్ కాబోతోంది. మానవ స్పర్సని అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడే అఘోర పాత్ర లో విశ్వక్సేన్ కనపడబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ప్రమోషన్ కంటెంట్ గామి మీద హైప్ ని విపరీతంగా పెంచేసింది ఇటీవల రిలీజ్ అయిన క్యారెక్టర్ ఇంట్రడ్యూసింగ్ గ్లిమ్ప్స్ అలానే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను డబల్ చేసేశాయి.

Advertisement

Advertisement

ఫిబ్రవరి 29వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ ని కూడా స్పీడ్ గా చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో లీడ్ రోల్ లో హీరోయిన్ చాందిని చౌదరి కనపడబోతోంది. చాందిని ఫస్ట్ లుక్ ని మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు ఈ పోస్టర్లో చాందిని వీధుల్లో నడుచుకుని వెళుతున్నట్లు గా చూపించారు. ఇలా ఆమె ని పరిచయం చేయడం జరిగింది. విశ్వక్సేన్ తో పాటుగా ఆమె చేసిన సాహస యాత్ర సినిమాలో ఉన్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.

కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని కార్తీక శబరీష్ నిర్మించారు.వారణాసి కుంభమేళాలో షూటింగ్ నిర్వహించారు. అఘోర అయిన హీరో విశ్వక్సేన్ ఏం సాధించబోతున్నారు అనేది ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో విభిన్న ప్రయోగాలు చేసిన విశ్వక్సేన్ అఘోర పాత్ర లో ఎలా ఆకట్టుకుంటారనేది చూడాలి. హారిక పేడాడ, మహ్మద్ సమత్ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు నరేష్ కుమారన్ మ్యూజిక్ ని అందించారు ప్రత్యూష వత్యం ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading