Home » RRR తరహాలోనే జక్కన్న ప్లాన్.. మహేష్ ని కంట్రోల్ చేసేందుకే..!

RRR తరహాలోనే జక్కన్న ప్లాన్.. మహేష్ ని కంట్రోల్ చేసేందుకే..!

by Sravya

రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే రాజమౌళి బాహుబలి సినిమాతో వండర్ ని క్రియేట్ చేశారు. తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికి వెళ్ళిపోయారు సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాని పూర్తిచేసుకుని ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి సినిమా చేయడానికి సిద్ధమయ్యారు ఈ సినిమాని రాజమౌళి ఎలా తెర మీదకి తీసుకువస్తారా అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఇప్పుడు అనేక కండిషన్స్ ని పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

rajamouli 1

మహేష్ బాబు ని కంట్రోల్ లో పెట్టేందుకు జక్కన్న కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం మరి ఇక జక్కన్న నిర్ణయం ఏంటి, అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు మూవీ మీద ఫోకస్ పెట్టారు. మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా ఈ సినిమా తెర మీదకి రాబోతోంది ఈ సినిమాకి కథ ఇదే అని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అనేక ఇంటర్వ్యూలో చెప్పారు ఇండియానా జోన్స్ తరహాలో ప్రపంచవ్యాప్తంగా అందరూ మెచ్చే విధంగా సినిమాని తీస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రచారం సాగుతోంది.

అదేంటంటే ఈ మూవీకి సంబంధించిన అనేక ప్రచారాలు తెర మీదకి వస్తుండడంతో ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలో ఎలా అయితే రాజమౌళి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారో, ఇప్పుడు కూడా మహేష్ బాబు సినిమా విషయంలో అదే చేయబోతున్నట్లు తెలుస్తోంది, నిర్మాత కేఎల్ నారాయణ మహేష్ బాబు రాజమౌళి ముగ్గురు కలిసి ఒక జాయింట్ ప్రెస్ మీట్ పెడతారని సినిమాకి సంబంధించిన కొన్ని వివరాలతో పాటు ప్రెస్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రెస్ మీట్ పూర్తయిన తర్వాత మహేష్ బాబు యాడ్ షూట్ లో పాల్గొనబోతున్నట్లు కూడా తెలుస్తోంది. తర్వాత పూర్తిస్థాయిలో మహేష్ బాబు సీక్రెసీ మెయింటైన్ చెయ్యాలని రాజమౌళి సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ మీదకు సినిమా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఈలోపు మహేష్ బాబు తన ఫ్యామిలీ టూర్స్ కంప్లీట్ చేసుకుని రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాడీ ఫిట్నెస్ విషయంలో కొన్ని దేశాలకు వెళ్లి అక్కడ ట్రైనర్లతో వర్క్ షాప్ చేసి వచ్చిన మహేష్ బాబు పూర్తిస్థాయిలో బాడీని ట్యూన్ చేసేలో చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading