ఐపీఎల్ 2022 మెగా వేలంలో విజయేంద్ర చాహల్ ని కొనుగోలు చేయకపోవడానికి కారణాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ హెడ్ కోచ్ మైక్ హెసెన్ చెప్పారు. మార్క్యు ప్లేయర్ల జాబితాలో అతను లేకపోవడంతోనే జట్ట లోకి తీసుకోలేదని అన్నారు. సుదీర్ఘ కాలం పాటు ఆరిసీబీ కి ఆడిన చాహాల్ ని తిరిగి కొనుగోలు చేయకపోవడంతో అతను తీవ్ర అసంతృప్తికి గురయ్యారని మైక్ హెసెన్ అన్నారు. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేళానికి ముందు ఆరిసీబీ విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్ ని మాత్రమే రిటర్న్ చేసుకుంది. వేలంలో ఇతర ఆటగాళ్ళని కొనుగోలు చేసిన ఆర్సీబీ చాహాల్ ని పట్టించుకోలేదు. కనీసం బిడ్ కూడా వేయలేదు. అతనికి బదులు శ్రీలంకన్ ఆన్లైన్ స్పిన్ ఆల్ రౌండర్ ని కొనుగోలు చేసింది.
Advertisement
ఈ నిర్ణయం మీద అప్పట్లో చాహల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఒక వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా తీసుకోకపోవడానికి కారణాన్ని RCB డైరెక్టర్ మైక్ హేస్సన్ చెప్పారు. ఐపిఎల్ 2022 మెగా వేలం తర్వాత చాహల్ తో మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ అతను ఫోన్ ఎత్తలేదు అని చెప్పారు. అక్కడ పరిస్థితులు అతనికి వివరించడం కష్టం. నాతో మాట్లాడేందుకు కూడా అతను ఆసక్తి చూపించలేదు. ఈ విషయంలో అతన్ని నేను నిందించట్లేదు అని అన్నారు. మేము ఎదుర్కొన్న సమస్యలు అతనికి బాగా తెలుసు.
Advertisement
మేము ముగ్గురు ప్లేయర్లని మాత్రమే రిటైన్ చేసుకున్నాము. వేలంలో హర్షల్ పటేల్తో పాటుగా విజయేంద్ర చాహాల్ ని తిరిగి కొనుగోలు చేయాలనుకున్నాము. ముగ్గురు ఆటగాళ్లను రిటర్న్ చేసుకోవడం ద్వారా లభించిన నాలుగు కోట్లని వేలంలో వాడాలని భావించాం. అయితే మార్క్యు ప్లేయర్ల జాబితాలో చాహల్ లేడు. అతను ఆరవ సెట్ లో ఉన్నాడు అప్పటి కి డబ్బులు లేవు అని అన్నారు. రాజస్థాన్ రాయల్స్ 6.5 కోట్ల దరికి అతనిని కొనుగోలు చేసింది ఆర్సిబి తరఫున 113 మ్యాచ్లో ఆడాడు. 139 వికెట్లను తీశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!