Home » పుష్ప 2 సినిమా వాయిదా.. అందుకే చైతు తండేల్ ని రిలీజ్ చేస్తున్నారా..?

పుష్ప 2 సినిమా వాయిదా.. అందుకే చైతు తండేల్ ని రిలీజ్ చేస్తున్నారా..?

by Sravya
Ad

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా పెద్ద హిట్ అయింది. పుష్ప టు కోసం ఫ్యాన్స్ అయితే విపరీతంగా ఎదురు చూస్తున్నారు. పుష్ప టు సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు కొంత మంది అభిమానులు ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. నిజానికి ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ సందర్భం గా పుష్ప టూ ని రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాలో కేశవ పాత్ర పోషించిన జగదీష్ ప్రస్తుతం జైల్లో ఉండడం తో షూటింగ్ ఆలస్యం అవుతుందని అందుకనే ఈ సినిమా ని వాయిదా వేస్తున్నట్లు ట్వీట్లు చేస్తున్నారు.

Advertisement

Advertisement

ఈ సినిమా తో ఆగస్టు 15న అజయ్ దేవగన్ సింగం అగైన్ కూడా రోజు రిలీజ్ కాబోతోంది. ఇంకో సినిమా రావాలి కానీ కేవలం సింగం అగైన్ ఒక్కటే రిలీజ్ కాబోతుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ ఎంత పట్టు పట్టినా కూడా సుకుమార్ పర్ఫాక్షన్ తో సినిమా లేట్ అవుతుందని ఆయనకి ఇలా ప్రాజెక్టులు లేట్ అయ్యే హిస్టరీ ఉందని అంటున్నారు అంతా. ఈ సినిమా రిలీజ్ పై ప్రొడ్యూసర్లు కూడా ఎక్కడా కంగారు పడట్లేదు.

అసలు క్వాలిటీ విషయంలో తగ్గేదేలే అని అంటున్నారు. పుష్ప 2 ఆగస్టు 15 కి రిలీజ్ అయితేనే పర్ఫెక్ట్ రిలీజ్ అని అంటున్నారు ఒకవేళ కనుక పుష్ప 2 సినిమా వాయిదా పడితే మరికొన్ని సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటాయి. పుష్ప టు సినిమా వాయిదా పడితే ఆ రోజు సినిమాలు దించాలని చాలామంది నిర్మాతలు భావిస్తున్నారు. మరి పుష్ప టు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంద లేదా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. మరి ఏమవుతుంది అనేది చూడాలి. పుష్ప టు వాయిదా పడితే టాండేల్ సినిమా రావచ్చని అంత అంటున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading