Home » పవన్ కళ్యాణ్ కోసం MLA అవుతాను.. పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన ఆది..!

పవన్ కళ్యాణ్ కోసం MLA అవుతాను.. పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన ఆది..!

by Sravya
Ad

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి సో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఎన్నికల హడావిడి మొదలైపోయింది. రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి సీటు దక్కని వాళ్ళు పార్టీలు మారడం అలానే ప్రచారం మొదలు పెట్టడం ఇటువంటివన్నీ మనం ఇప్పుడు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కి చాలామంది అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ వీరాభిమాని హైపర్ ఆది పొలిటికల్ ఎంట్రీ మీద క్లారిటీ ఇచ్చేసారు. జనసేన టికెట్ ఇస్తే గెలుస్తానంటూ విశ్వాసం ప్రకటించారు. అదే టైంలో మంత్రి రోజాతో విభేదాలపై ఓపెన్ అయ్యారు. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి జబర్దస్త్ మాజీ కమెడియన్ హైపర్ ఆది రాజకీయాల్లోకి వస్తానని చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు.

Advertisement

ఆడికి జనసేన పార్టీ టికెట్ ఇస్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి జనసేన పార్టీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో కూడా ఆది పాల్గొన్నారు సభల్లో రాజకీయ ప్రసంగాలతో హోరెత్తించారు. మొదటిసారి హైపర్ ఆది పొలిటికల్ ఎంట్రీ గురించి ఓపెన్ అయ్యారు ఈ క్రమంలో ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం జరిగింది. ప్రొఫెషనల్ వేరు పాలిటిక్స్ వేరు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే జబర్దస్త్ అందుకు కారణం రోజా మేడంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. జబర్దస్త్ సెట్స్ లో ఆమె పాలిటిక్స్ మాట్లాడే వారు కాదు నాగబాబు లానే ఆమె కూడా ప్రోత్సహించేవారు ఆమె ఇష్టపడే వ్యక్తులు వేరు అలానే నేను ఇష్టపడే వ్యక్తులు వేరు. నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఆయన సిద్ధాంతాలు నచ్చి ఆయన పాటు నడుస్తున్నాను అని ఆది అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా ఎవరైనా అంటే నేను రియాక్ట్ అవుతాను ఆయన వ్యక్తిగతంగా ఎవరిని దూషించరు.

Advertisement

సమస్యల గురించి మాత్రమే మాట్లాడతారని అది అన్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలవాలని నేను కోరుకుంటున్నాను నేను పదవులు ఎమ్మెల్యే టికెట్లు ఆశించి జనసేనకి సపోర్ట్ ఇవ్వట్లేదు. ఒకవేళ నాకు జనసేన టికెట్ ఇచ్చి పోటీ చేయమంటే ఖచ్చితంగా చేస్తానని ఆయన్ని గెలిపించడం కోసం నేను గెలుస్తానని హైపర్ ఆది అన్నాడు. ఈసారి జనసేన తరపున నేను క్యాంపైన్ చేయడానికి వెళ్తానని హైపర్ ఆది చెప్పారు. హైపర్ ఆది మాటల్ని చూస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది జనసేన ప్రస్తుతం టిడిపి తో పొత్తులో ఉంది. జనసేన పార్టీకి టిడిపి ఇచ్చే కొద్ది సీట్లలో హైపర్ ఆదికి ఒకటి ఇవ్వడం సాధ్యం కాదు. ఇది ఇలా ఉంటే హైపర్ ఆది పలు సినిమాల్లో కామెడీ రోల్స్ చేస్తున్నాడు అలానే శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి వాటిలో కూడా కనపడుతున్నాడు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading