Home » స‌మంతే మొద‌ట విడాకులు అడిగింది…చైతూ ఎంతో మ‌ద‌న‌ప‌డ్డాడు : నాగార్జున‌

స‌మంతే మొద‌ట విడాకులు అడిగింది…చైతూ ఎంతో మ‌ద‌న‌ప‌డ్డాడు : నాగార్జున‌

by AJAY
Ad

స‌మంత నాగ‌చైత‌న్య విడాకులు ప్ర‌క‌టించి నెల‌లు గ‌డిచి పోతున్నా ఇంకా వీరి విడాకుల వార్త హాట్ టాపిక్ గానే ఉంది. తాజాగా చైతూ తండ్రి నాగార్జున వీరిద్ద‌రి విడాకుల అంశంపై మ‌రోసారి స్పందించారు. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ….స‌మంత‌నే మొద‌ట‌గా విడాకులు అడిగింద‌ని తెలిపాడు. నాలుగేళ్ల పాటూ ఇద్ద‌రూ ఎంతో అన్య‌న్యంగా ఉండేవార‌ని నాగార్జున తెలిపారు.

samanta

Advertisement

 

గ‌త ఏడాది న్యూయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కూడా క‌లిసే జ‌రుపుకున్నార‌ని చెప్పాడు. ఇంత‌లోనే ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ విడాకులు తీసుకున్నార‌ని తెలిపాడు. న్యూయ‌ర్ త‌వాతే స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని అన్నారు. మొద‌ట సమంత‌నే చైతూ నుండి విడాకుల‌ను కోరింద‌ని చెప్పాడు. ఆమె నిర్ణ‌యాన్ని గౌర‌విస్తూ చైతూ విడాకులు ఇచ్చాడ‌ని తెలిపాడు. విడాకుల విష‌యాన్ని త‌న‌తో చెప్పాడానికి చైతూ ఎంతో మ‌ద‌న‌ప‌డ్డార‌ని నాగార్జున వ్యాఖ్యానించారు. ఈ విష‌యాన్ని తాను ఎలా తీసుకుంటానో అని బాధ‌ప‌డ్డాడ‌ని….కుటుంబ ప‌రువు మ‌ర్యాద గురించి మ‌ద‌నప‌డ్డాడ‌ని తెలిపాడు.

Advertisement

Samantha nagachaitanya

Samantha nagachaitanya

వారు విడిపోయేంత పెద్ద స‌మస్య ఏంటో త‌న‌కు ఇప్ప‌టికీ అర్థం కాలేద‌ని నాగార్జున తెలిపారు. ఇదిలా ఉంటే ఇంత‌కాలం స‌మంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో న‌టించడం వద్దు అని చెప్పిన సినిమాలు చేయ‌డం వ‌ల్లే నాగ‌చైత‌న్య విడాకులు ఇచ్చారంటూ వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ తాజాగా నాగార్జున ఇచ్చిన క్లారిటీతో స‌మంత‌నే విడాకుల‌కు కార‌ణం అని తేలిపోయింది.

also read :  పుష్ప సినిమాను మిస్ చేసుకున్న స్టార్స్ ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading