మనకి అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. నిద్రపోయినప్పుడు కలలు రావడం సహజం. కొన్ని కొన్ని సార్లు ఇటువంటి కలలు కూడా వస్తూ ఉంటాయి. ఇటువంటి కలలు వస్తున్నట్లయితే కచ్చితంగా ప్రేమ లో ఉన్నట్లు అర్థం. కలలు రావడం అనేది ప్రతి ఒక్కరికి సహజమే. ప్రతి వ్యక్తికి ఏదో ఒక కల వస్తూ ఉంటుంది. నిజానికి కొన్ని కలలను మనం మర్చి పోతూ ఉంటాం కూడా. నిద్ర లో వచ్చిన కలలు కొన్ని నిజమైతే మరికొన్ని కలలుగానే మిగిలిపోతూ ఉంటాయి.
Advertisement
Advertisement
కొంతమందికి ఒకే వ్యక్తి పదే పదే కనబడుతూ ఉంటారు దీంతో చాలా మంది అసలు నాకు తాను ఎందుకు అలా కనిపిస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు. పదేపదే ఒక వ్యక్తి కలలో కనపడుతున్నట్లయితే కచ్చితంగా ఆ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు అర్థం. స్వప్న శాస్త్రం ప్రకారం మన మనసులో మెదిలే భావాలు భావావేశాల సమ్మేళనమే కల. ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉండడం వలన నిద్రపోయినప్పుడు వాళ్ళు కలలో కనపడుతూ ఉంటారు. అందువలన నిద్రపోయినప్పుడు వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు సో ఇలా ఈ కలలు వస్తున్నట్లయితే కచ్చితంగా వారితో ప్రేమలో ఉన్నారని మీరు గ్రహించాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!