Home » చెక్కులని వెనక్కి ఇచ్చేస్తున్న జనసేనా.. టికెట్ కోసమా..?

చెక్కులని వెనక్కి ఇచ్చేస్తున్న జనసేనా.. టికెట్ కోసమా..?

by Sravya
Ad

ఏపీలో టీడీపీ తో చేతులు కలిపి జనసేన అందర్నీ ఆశ్చర్యపరిచింది వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీ సమాయత్తం అవుతున్న వేళ పలువురు వచ్చి పార్టీలో చేరుతున్నారు. అయితే ఇది మంచి పరిణామమే అని పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారు ఈ క్రమంలో ఇలా పార్టీలో చేరిన ప్రముఖులు పార్టీ ఫండ్ కింద కొంత మొత్తాలని ఎవరు చెక్కుల రూపంలో పవన్ కి నేరుగా అందించారు. వీటిని కోశాధికారి ఇచ్చారు వాటిని డబ్బులు రూపంలో మార్చుకోవాల్సి ఉంటుంది. దీనిని పార్టీ ఫండ్ కింద ప్రచారానికి పంచాలని అనుకుంటున్నారు. చెక్కులు ఇచ్చిన వారికి వెంటనే ఆయా చెక్కులు తిరిగి ఇవ్వాలని పార్టీ కీలక నేతలకు చెప్పారు దీంతో వారు చెక్కులు ఇచ్చిన వారికి వెంటనే పంపే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Advertisement

చెక్కులు మొత్తం విలువ 20 కోట్ల వరకు ఉంటుందని సమాచారం అయినప్పటికీ చెక్కులు తీసుకోకూడదని నిర్ణయం వెనుక టికెట్లే కారణమని అర్థమవుతుంది. పార్టీలో చేరిన వారికి టికెట్లు ఆశించే లక్షణం సాధారణమే ఎన్నికల సమయంలో టికెట్లు కావాలని గత రెండు రోజులుగా పోరు పెడుతున్నట్లు పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి టికెట్లు ఎక్కువ లేకపోవడం ఇప్పటికే పార్టీలో ఉన్న వాళ్ళకి న్యాయం చేయాల్సి ఉండడంతో చెక్కులు ఇచ్చిన వారిని పక్కన పెట్టాలని తిరిగి వాళ్ళ డబ్బులు ఇచ్చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading