విడాకులు రూమర్స్ కి ఐశ్వర్య చెక్ పెట్టేసింది. ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ దంపతులపై కొంత కాలంగా ఊహించని పుకార్లు వస్తున్నాయి. ఈ జంట విడిపోవడానికి సిద్ధపడిందని పుకార్లు వచ్చాయి. అయితే వీటికి ఇంతకుముందు అభిషేక్ తనదైన శైలిలో చెక్ పెట్టారు ధీరుభాయ్ అంబానీ స్కూల్ ఈవెంట్లో భారీ ఐశ్వర్య కూతురు ఆరాధ్య బచ్చన్ తో కలిసి కనపడ్డారు అదే ఈవెంట్లో అమితాబచ్చన్ కూడా ఉన్నారు, బచ్చన్ కుటుంబ రహస్యాలు గురించి ముంబై మీడియా ఎప్పుడూ ఏదో ఒక పుకార్లు పుట్టిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఐశ్వర్యరాయ్ తనదైన శైలిలో చెక్ పెట్టేసారు.
Advertisement
Advertisement
భర్త అంటే తనకి ఉన్న గౌరవం ప్రేమాభిమానాలను తనదైన శైలిలో ఆమె చాటుకున్నారు అభిషేక్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ఐశ్వర్యరాయ్ హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. చిన్నప్పటి ఫోటోలు షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాశారు. ఇక్కడ మీకు చాలా ఆనందం ప్రేమ ప్రశాంతత శాంతి మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు ఆశీర్వదించండి అని రాశారు. దీంతో ఈ పుకర్ల అన్నింటికీ ఒక్కసారిగా చెక్ పెట్టినట్లు అయింది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!