రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగం మీద చర్చ జరిగింది. వైయస్ఆర్సీపీ తరఫున చర్చలో పాల్గొన్న ఎంపీ విజయసాయిరెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోలేని నష్టం చేసిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనికి ఏపీ పెద్ద బాధిత రాష్ట్రమని అన్నారు. అలానే ఆయన మాట్లాడుతూ 2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని అన్నారు ఏపీ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గౌరవించలేదని చెప్పారు.
Advertisement
Advertisement
ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో కచ్చితంగా చెప్పారు. పదేళ్ల తర్వాత చిట్టచివరిలో అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారని విజయ్ సాయి రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి విలన్ అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని అనేక సందర్భాల్లో కోరారని విజయసాయిరెడ్డి అన్నారు. 2029 నాటికి కాంగ్రెస్ ముక్త భారత్ తధ్యమని అన్నారు మిత్రపక్షాలే కాంగ్రెస్‌ని నమ్మట్లేదని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కంటే తక్కువ గెలుస్తుందని మమతా బెనర్జీ చెప్తున్నారు అని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!