Home » సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ వరుస భేటీలు.. జనసేన పోటీ చేసేది ఎక్కడంటే..?

సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ వరుస భేటీలు.. జనసేన పోటీ చేసేది ఎక్కడంటే..?

by Sravya
Ad

టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకేరోజు రెండుసార్లు భేటీ అవ్వడం సుదీర్ఘంగా చర్చలు జరపడం అందరిలో ఆసక్తిని నెలకొల్పింది. సీట్ల సర్దుబాటు మీద ఫైనల్ చర్చల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం దాదాపు మూడు గంటలు పాటు ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. తర్వాత మళ్లీ ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. రెండు పార్టీల పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు మీద చర్చ జరిపారు ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని విషయం మీద ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సీట్ల గురించి క్లారిటీ వచ్చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Advertisement

జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల లిస్ట్ ని పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లు తెలుస్తోంది కొన్ని స్థానాల్లో స్పష్టత వచ్చేసింది. కానీ మిగిలిన కొన్ని స్థానాల్లో రావాల్సి ఉంది. తెనాలి, భీమిలి, నెల్లిమర్ల లేదా గజపతినగరం, విశాఖ, చోడవరం లేదా అనకాపల్లి, పెందుర్తి లేదా ఎలమంచిలి, పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోలు, గన్నవరం, రాజానగరం, అమలాపురం, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం లేదా తణుకు, ఏలూరు లేదా కైకలూరు, చీరాల, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, రాజంపేట, తిరుపతి లేదా చిత్తూరు జనసేన కి కేటాయించినట్లు తెలుస్తోంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading