Home » ఓటీటీ లోకి గుంటూరు కారం రెడీ.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

ఓటీటీ లోకి గుంటూరు కారం రెడీ.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

by Sravya
Ad

మహేష్ బాబు హీరోగా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా జనవరి 12న సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ యాక్షన్ హీరోగా నటించారు. శ్రీలీల కథానాయకగా నటించారు. మీనాక్షి చౌదరి కూడా ఈ సినిమాలో నటించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పెద్ద హిట్ అయింది. చక్కని ఓపెనింగ్స్ ని సాధించింది. నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement

ఫిబ్రవరి 9 నుండి నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమాను తీశారు. ఓటిటిలోకి ఎప్పుడు వస్తుందని మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న వస్తుందని తెలియడంతో ఖుష్ అవుతున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading