Home » మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న సోహైల్.. నా సినిమా చూడడానికి రాలేదంటూ..!

మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న సోహైల్.. నా సినిమా చూడడానికి రాలేదంటూ..!

by Sravya
Ad

బిగ్ బాస్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు సోహైల్. బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించాడు. అలానే హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసినప్పటికీ ఒక హిట్ ని కూడా అందుకోలేదు. తాజాగా బూట్ కట్ బాలరాజు సినిమాతో సోహైల్ వచ్చాడు. అయితే ఈ సినిమాతో కేవలం హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా మారాడు. తన తండ్రి రిటైర్మెంట్ అవ్వగా వచ్చిన పెన్షన్ డబ్బులతో పాటు తన సంపాదనంతా సినిమా కోసం పెట్టాడు.

Advertisement

Advertisement

ఇంత కష్టపడి సినిమా రిలీజ్ చేసిన తర్వాత జనం మాత్రం సినిమాని చూడడానికి రాలేదు. ఈ కారణంగా చాలా చోట్ల షోలు నిలిపేశారు. దీంతో మీడియా సమక్షంలో కన్నీరు పెట్టుకున్నాడు. కంటెంట్ ఉన్న చిత్రాలని ఆదరిస్తామంటారు. అలాంటి సినిమాతో వచ్చినప్పుడు చూడరు అని ఈ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సినిమా ఫ్రెండ్స్ తోనే కాదు ఫ్యామిలీతో కూడా చూసేది. అలాంటి సినిమా బూట్ కట్ బాలరాజు. కానీ ఆడియన్స్ రాలేదు. దయచేసి నా బాధని అర్థం చేసుకోండి అని కంట తడి పెట్టుకున్నాడు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading