Home » బాలయ్య సినిమాలో బాలీవుడ్ బ్యూటీ…!

బాలయ్య సినిమాలో బాలీవుడ్ బ్యూటీ…!

by Sravya
Ad

బాలకృష్ణ హీరోగా NBK 109 వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ జరుగుతుంది. నందమూరి బాలయ్య ప్రస్తుతం బాబి కొల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు వర్కింగ్ టైటిల్ తోనే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది అయితే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలా నటించబోతున్నట్లు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఊర్వశి ఇప్పుడు బాలయ్య సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్బికె 109 లో ఫిమేల్ లీడ్ గా ఊర్వశి కనపడబోతున్నట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని ఊర్వశి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Advertisement

Advertisement

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా కోసం వర్క్ అవుట్స్ చేస్తున్న ఫోటోలని ఈమె షేర్ చేసుకుంది. ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ బాబి డియోల్ కూడా నటిస్తున్నాడు. బాబి బర్త్డే సందర్భంగా చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ మూవీలో తెలుగు నటి చాందిని చౌదరి కూడా నటిస్తోంది సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading